Success Story: జుట్టుతోనే కోట్ల సంపాదన.. ఏకంగా పెద్ద ఇల్లే కొనేసింది.. అదెలా సాధ్యమని అవాక్కవుతున్నారా..? అసలు ఆమె ఏం చేస్తోందంటే..!
ABN , First Publish Date - 2023-11-10T18:45:27+05:30 IST
సోషల్ మీడియా ద్వారా కేవలం ఎంటర్‌టైన్‌మెంట్, పాపులారిటీ మాత్రమే కాదు.. డబ్బులు సంపాదించుకునేందుకు కొత్త మార్గంగా కూడా మారింది. ఎంతో మంది యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్, టిక్‌టాక్‌ల ద్వారా పాపులారిటీ సంపాదించుకుని భారీగా సంపాదిస్తున్నారు.

సోషల్ మీడియా (Social Media) అందుబాటులోకి వచ్చాక చాలా మంది జీవితాలు మారిపోయాయి. కేవలం ఎంటర్‌టైన్‌మెంట్, పాపులారిటీ మాత్రమే కాదు.. డబ్బులు సంపాదించుకునేందుకు (Earning) కొత్త మార్గంగా కూడా మారింది. ఎంతో మంది యూట్యూబ్ (Youtube), ఇన్‌స్టాగ్రామ్ (Instagram), ట్విటర్ (Twitter), టిక్‌టాక్ (Tik Tok)ల ద్వారా పాపులారిటీ సంపాదించుకుని లక్షల్లో, కోట్లలో సంపాదిస్తున్నారు. కంటెంట్ క్రియేటర్‌లు ప్రత్యేక వీడియోలతో ప్రజల దృష్టిని ఆకర్షించడంలో విజయం సాధిస్తున్నారు. తద్వారా భారీగా ఆర్జిస్తున్నారు. స్కాట్లాండ్‌కు (Scotland) చెందిన ఓ మహిళ తన ఉద్యోగాన్ని వదులుకుని మరీ కంటెంట్ క్రియేటర్‌గా మారింది (Success Story).
స్కాటిష్ మహిళ జియా ఓ'షౌగ్నెస్సీ (Zia O'Shaughnessy) కేవలం హెయిర్ వాష్ వీడియోల ద్వారా కోట్లు సంపాదిస్తోంది. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్‌లలో భారీగా ఫాలోవర్లు ఉన్నారు. జియా 2021లో హెయిర్ వాష్ టెక్నిక్స్ గురించి చెబుతూ ఓ వీడియోను టిక్‌టాక్‌లో పోస్ట్ చేసింది. అది ఇన్‌స్టంట్‌గా హిట్ అయింది. ఏకంగా 3.5 కోట్ల మంది ఆ వీడియోను వీక్షించారు. దీంతో జియా తన ఉద్యోగాన్ని మానేసి కంటెంట్ క్రియేటర్‌గా (Content Creator) ఫుల్ టైమ్ పని చేయడం ప్రారంభించింది. కంటెంట్ క్రియేటర్‌గా మారకముందు జియాకు రూ.8 లక్షల వరకు అప్పు ఉండేది (Social Medai Influencer).
Shocking Twist: ఏం తెలివిరా బాబూ.. బిచ్చగాడిని చంపి.. కన్నకొడుకే చనిపోయాడని నమ్మించి రూ.80 లక్షలు కొట్టేశారు.. 17 ఏళ్ల తర్వాత..!
ఆమె వీడియోలకు టిక్‌టాక్‌లో ఆదరణ పెరిగిన తర్వాత సంపద కూడా భారీగా పెరిగింది. ఒక్కో వీడియో ద్వారా ఆమె సగటున రూ.4 లక్షల వరకు సంపాదిస్తోంది. చాలా తక్కువ సమయంలోనే జియా రూ.1.8 కోట్ల విలువైన ఇంటిని కొనుగోలు చేసింది. ఇద్దరు పిల్లల తల్లి అయిన జియా ఇంటి పట్టునే ఉంటూ బాగా సంపాదిస్తూ ఎంతో మందికి స్ఫూర్తిగా మారింది (Hair Washing Video).