40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: బాబోయ్.. ఇదేం పక్షి.. రెండే రెండు నిమిషాల్లో ఉడుతను అమాంతం మింగేసింది..!

ABN, First Publish Date - 2023-06-23T18:06:09+05:30

చిన్న చిన్న పక్షులను చూస్తే ఎంతో ముద్దొస్తుంటాయి. అయితే చూడగానే భయం పుట్టించే పక్షులు కూడా ఉంటాయా అంటే.. అవును అనే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. సాధారణంగా అలికిడి వినపడితే చాలు ఎగిరిపోయే పక్షులను రోజూ చూస్తూనే ఉంటాం. కానీ చూడగానే ఎదురుదాడి చేసే..

Viral Video: బాబోయ్.. ఇదేం పక్షి.. రెండే రెండు నిమిషాల్లో ఉడుతను అమాంతం మింగేసింది..!
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిన్న చిన్న పక్షులను చూస్తే ఎంతో ముద్దొస్తుంటాయి. అయితే చూడగానే భయం పుట్టించే పక్షులు కూడా ఉంటాయా అంటే.. అవును అనే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. సాధారణంగా అలికిడి వినపడితే చాలు ఎగిరిపోయే పక్షులను రోజూ చూస్తూనే ఉంటాం. కానీ చూడగానే ఎదురుదాడి చేసే పక్షులను చాలా అరుదుగా చూస్తుంటాం. ఇలాంటి పక్షులకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. రెండే రెండు నిమిషాల్లో ఉడుతను అమాంతం మింగేసిన పక్షిని చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు.

సోషల్ మీడియాలో సీగల్ పక్షికి సంబంధించిన వీడియో (Seagull bird viral video) తెగ చక్కర్లు కొడుతోంది. ఆహారం కోసం రోడ్డు పక్కన వేచి చూస్తున్న సీగల్ పక్షికి ఎదురుగా ఓ ఉడుత కనపడుతుంది. ఇంకేముందీ, చూసీ చూడగానే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే దానిపై దాడి చేసింది. నోట కరుచుకుని చూస్తుండగానే.. రెండే రెండు నమిషాల్లో ఉడుతను అమాంతం మింగేసింది. కొంచెం కొంచెం మింగడం, కాసేపు కాగడం.. ఇలా నిమిషాల వ్యవధిలో (bird swallowed the squirrel) మొత్తం మింగేస్తుంది. తర్వాత ‘‘ఈ పూటకు నా కడుపు నిండిందోచ్’’.. అన్నట్లుగా అక్కడి నుంచి తుర్రుమని ఎగిరిపోతుంది.

Viral Video: 22 సెకన్ల నిడివి ఉన్న స్కూటీ వీడియో.. చూసి అవాక్కవుతున్న నెటిజన్లు.. అందరి నోటా ఒకే ఒక్క ప్రశ్న..!

అక్కడే ఉన్న ఓ వ్యక్తి ఈ ఘటనను అక్కడే ఉన్న ఓ వ్యక్తి వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు షాకింగ్ కామెంట్లు (Shocking comments) పెడుతున్నారు. ‘‘ఇక నుంచి నాకు సీగల్ పక్షులంటే ఇష్టం లేదు’’.. అని కొందరు, ‘‘ఇలాంటి పక్షులను మేమెక్కడా చూల్లేదు బాబోయ్’’.. అని మరికొందరు, ‘‘ఇంత అందమైన పక్షి.. ఇలా చేస్తుందనుకోలేదు’’.. అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి ఈ వీడియో మాత్రం మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Bride Video: కాసేపట్లో పెళ్లనగా పెళ్లికూతురి ఎంట్రీ.. నేరుగా పెళ్లిపీటలపైకి ఎక్కకుండా వధువు చేసిన పనికి నివ్వెరపోయిన బంధువులు..!

Updated Date - 2023-06-23T18:06:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising