ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: ఓ పేదవాడి ఆకలి పోరాటానికి సజీవ సాక్ష్యం.. తేడా వస్తే ప్రాణాలే పోతాయని తెలిసినా.. పొట్టకూటి కోసం..!

ABN, First Publish Date - 2023-06-13T12:53:14+05:30

ప్రతిరోజు సోషల్ మీడియాలో (Social Media) ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Viral Video: ప్రతిరోజు సోషల్ మీడియాలో (Social Media) ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని వీడియోలు ఫన్నీగా ఉంటే.. మరికొన్ని వీడియోలు ఆలోచింపజేసేలా ఉంటాయి. కానీ, కొన్ని వీడియోలు చూడగానే షాక్ అయ్యేలా ఉంటాయి. ప్రస్తుతం ఇలాంటి వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది (Video goes Viral on Social Media). ఈ వీడియో చూస్తే.. వామ్మో పొట్టకూటి కోసం ఇంత రిస్క్ చేయాలా? అని అనిపించకమానదు. ఇంకా చెప్పాలంటే ఓ పేదవాడి ఆకలి పోరాటానికి సజీవ సాక్ష్యం ఈ వీడియో అనడంలో ఎలాంటి సందేహం లేదు.

వీడియోలోని దృశ్యాల ఆధారంగా.. ఓ యువకుడు భవనం నిర్మాణ పనులు చేస్తుండటం మనం చూడొచ్చు. దానిలో భాగంగా భూమిపై నుంచి కొన్ని అడుగుల ఎత్తులో అతడు స్లాబ్ వేసేందుకు గాను చెక్కలను పేరుస్తున్నాడు. అంత ఎత్తులో కూడా అతడు ఎలాంటి సేఫ్టీ లేకుండా ఆ పని చేయడం చూస్తుంటే ఒళ్లు జలదరించడం ఖాయం. ఏమాత్రం తేడా వస్తే ప్రాణాలే పోతాయని తెలిసి కూడా పొట్టకూటి కోసం అతడు ఇంత రిస్క్ చేయడం కొంచెం ఆలోచించాల్సిన విషయం. 'హస్నా జరూరి హై' (HasnaZarooriHai) అనే ట్విటర్ యూజర్ ఈ వీడియోను షేర్ చేశారు. 'ఓ పేదవాడు చావు కంటే కూడా ఆకలికే ఎక్కువ భయపడతాడు' అనే లైన్‌తో ఈ వీడియోను ట్వీట్ చేశారు. ఇప్పటివరకు వీడియోను 40వేలకు పైగా మంది వీక్షించారు. ఇక నెట్టింట వైరల్‌గా మారిన ఈ వీడియో చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.

NRI: ఆర్థిక నేరస్థుడిగా ఎన్నారై వ్యాపారవేత్త.. అసలు ఎవరీ రామచంద్రన్ విశ్వనాథన్..?


Updated Date - 2023-06-13T12:53:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising