Woman: ఇన్నాళ్లకు అవకాశం దొరికిందంటూ ఇంట్లోకి వెళ్లి.. కాసేపటికి బయటికి పరుగందుకున్న యువకులు.. ఆమె చేసిన ఒక్క పనితో..
ABN, First Publish Date - 2023-07-19T20:02:53+05:30
ఒంటరిగా ఉన్న మహిళలపై ఎవరు.. ఎటువైపు నుంచి దాడి చేస్తారో తెలీని పరిస్థితి నెలకొంది. అప్పటిదాకా బాగున్న వారు.. మహిళలను చూడగానే ఒక్కసారిగా రాక్షసులుగా మారిపోతుంటారు. తమ మాట వినని వారిపై దాడులు చేయడం, లైంగికంగా వేధించడం చేయడం సర్వసాధారణమైపోయింది. ఇలాంటి...
ఒంటరిగా ఉన్న మహిళలపై ఎవరు.. ఎటువైపు నుంచి దాడి చేస్తారో తెలీని పరిస్థితి నెలకొంది. అప్పటిదాకా బాగున్న వారు.. మహిళలను చూడగానే ఒక్కసారిగా రాక్షసులుగా మారిపోతుంటారు. తమ మాట వినని వారిపై దాడులు చేయడం, లైంగికంగా వేధించడం చేయడం సర్వసాధారణమైపోయింది. ఇలాంటి ఘటనలు రోజూ ఎక్కడో చోట జరుగుతూనే ఉన్నాయి. తాజాగా, ఉత్తరప్రదేశ్లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. కొందరు యువకులు ఒంటరిగా ఉన్న మహిళ ఇంట్లోకి వెళ్లారు. ఇన్నాళ్లకు అవకాశం దొరికిందంటూ ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు. స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) బండా ప్రాంతంలోని గిర్వాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన భార్యతో కలిసి స్థానికంగా నివాసం ఉంటున్నాడు. పని నిమిత్తం ఎక్కువగా బయటి ప్రాంతాలకు వెళ్తుంటాడు. ఇదిలావుండగా, ఇదే ప్రాంతానికి చెందిన ఇద్దరు యువకులు.. భర్తలేని సమయంలో భార్యను గమనిస్తూ ఉండేవారు. ఆమెను తమ దారికి తెచ్చుకోవాలని ప్రయత్నిస్తూ ఉండేవారు. అయితే సమయం కోసం వేచి చూస్తూ ఉండేవారు. ఇటీవల ఓ రోజు మహిళ భర్త పని మీద బయటికి వెళ్లాడు. ఈ విషయం తెలుసుకున్న యువకులు రాత్రి వేళ ఆమె ఇంటికి వెళ్లారు. ‘‘నీ కోసం ఎన్నో నెలలుగా ఎదురుచూస్తున్నాం.. ఇన్నాళ్లకు అవకాశం దొరికింది.. ఇక వదిలే ప్రసక్తే లేదు’’.. అంటూ ఆమెపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించారు.
Viral Video: ఈ పిల్లికి మరీ ఇంత అసూయ ఎందుకో.. యజమాని పట్టించుకోలేదని చివరకు ఏం చేసిందో చూడండి..
ఊహించని ఈ ఘటనతో ఆమె ఒక్కసారిగా షాక్ అయింది. అయితే వెంటనే తేరుకుని వారి నుంచి తప్పించుకునేందుకు శతవిధాలా ప్రయత్నించింది. అయినా యువకులు ఆమెను వదలకుండా (Indecent behavior) అసభ్యకరంగా ప్రవర్తించారు. ఈ క్రమంలో పక్కనే ఉన్న కర్ర తీసుకుని (Woman attacks youths) వారిపై దాడికి దిగింది. దీంతో భయపడిపోయిన యువకులు.. అక్కడి నుంచి పారిపోయారు. వెళ్తూ వెళ్తూ ఎరికైనా చెబితే చంపేస్తామంటూ బెదిరించారు. మరుసటి రోజు ఉదయం బాధితురాలు పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ బాధితురాలి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
Updated Date - 2023-07-19T20:02:53+05:30 IST