కాల్‌గర్ల్‌ను బుక్ చేసుకున్న ఇద్దరు కుర్రాళ్లకు దిమ్మతిరిగే షాక్.. ఆ యువతి వచ్చిన తర్వాత జరిగిన పరిణామాలతో బిత్తరపోయి పరార్..!
ABN, First Publish Date - 2023-02-23T18:17:42+05:30
కోటి విద్యలు... కూటి కోసం అన్నారు పెద్దలు. అంటే బతకడానికి కోటి విద్యలున్నాయంట. బాగానే ఉంది. ఏ మనిషికైనా ఒకటే
రైలు బండిని నడిపేది పచ్చ జెండాలే.. బతుకు బండిని నడిపిదే పచ్చ నోటు లే అని ఓ సినీ కవి అన్నాడు. అలాగే డబ్బు భలే జబ్బు అనే ఓ సినిమా కూడా ఉంది. అవును ఇది నిజమే. మనీ ఎంత డేంజరో నేటి ఉదంతాలే నిదర్శనం. డబ్బు కోసం ఎంతటి ఘోరాలకైనా తెగిస్తుంటారు. కొంత మంది తమకున్న అందంతో సంపాదిస్తుంటే... మరికొందరు శరీరాన్ని అమ్ముకుని సంపాదిస్తుంటారు. డబ్బు కోసం ఎన్ని అడ్డదారులైన తొక్కేవారుంటారు. నేడు నేరాలు-ఘోరాలు జరిగేవన్నీ పైసల కోసం జరిగిన ఘటనలే.
కోటి విద్యలు... కూటి కోసం అన్నారు పెద్దలు. అంటే బతకడానికి కోటి విద్యలున్నాయంట. బాగానే ఉంది. ఏ మనిషికైనా ఒకటే సూత్రం. కష్టే ఫలి. కష్ట పడి అనుభవించమని అర్థం. అంతేకాని కత్తి చూపించో.. తుపాకీ చూపించో సంపాదించమని కాదు. కానీ నేడు అక్రమ సంపాదన కోసం రకరకాలైన వక్రమార్గాన్ని ఎంచుకుంటున్నారు. అనంతరం కటకటాల పాలై జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఇంతకీ ఇదంతా ఎందుకనే కదా? మీడౌట్. అయితే ఈ స్టోరీ చదవాల్సిందే.
ఇది కూడా చదవండి: ఆర్టీసీ బస్సులో ఓ యువతిపై మూత్ర విసర్జన చేసిన 25 ఏళ్ల యువకుడు.. విమానంలోనే కాదు.. బస్సులోనూ అదే సీన్ రిపీట్..!
కర్ణాటకలోని బెంగళూరులో నివాసం ఉంటున్న మంజునాథ్, రజనీకాంత్ అనే ఇద్దరు యువకులు ఓ యువతిని బుక్ చేసుకున్నారు. ఈనెల 17న అర్ధరాత్రి బన్నేరుఘట్ట రోడ్డు దేవర చిక్కనహళ్లి దగ్గర యువతితో ఇద్దరు నిలబడ్డారు. ఇంతలో నాలుగు బైకుల్లో వచ్చిన గ్యాంగ్.. కారును ఢీకొట్టారంటూ మంజునాథ్, రజనీకాంత్‌తో గొడవకు దిగారు. అనంతరం కొద్దిక్షణాల్లోనే వచ్చిన మరికొందరు ఇద్దరు యువకులను కిడ్నాప్ చేశారు. ఒక నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి బెదిరింపులకు పూనుకున్నారు. అంతే కిడ్నాప్ అయిన విషయాన్ని గ్రహించిన మంజునాథ్ వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు రజనీకాంత్‌ను కాపాడారు. కిడ్నాపర్లతో పాటు యువతిని అరెస్ట్ చేశారు. పోలీసులు కూపీలాగితే ఆమె కాల్‌గర్ల్‌గా గుర్తించారు.
ఇది కూడా చదవండి: రాజభోగం అంటే ఇతడిదే.. ఇంట్లో ఖాళీగా ఉంటోంటే.. భార్యలే ఉద్యోగాలు చేసి భర్తను పోషిస్తున్నారు..!
యువకులతో కలిసి ఉన్నప్పుడు.. ముఠాకు ఫోన్‌లో సమాచారం అందించి కిడ్నాప్ అయినట్లుగా నటించింది. అంతా అనుకున్న ప్రకారం యువతి, ఆమె గ్యాంగ్ ఇద్దరిని ఎత్తుకెళ్లారు. కారులో వెళ్తుండగానే మంజునాథ్ కుట్రను పసిగట్టి.. వారి నుంచి తప్పించుకుని పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసి సమాచారం అందించాడు. ఇదిలా ఉంటే రజనీకాంత్ విడుదలకు కిడ్నాపర్లు రూ.5లక్షలు డిమాండ్ చేశారు. పోలీసులు యువకులిద్దర్ని రక్షించి కిడ్నాపర్లను అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. డబ్బు కోసం అడ్డదారులు తొక్కి కటకటాల పాలయ్యారు. ప్రస్తుతం కిడ్నాపర్లతో పాటు యువతి జైల్లో ఊచలు లెక్కెడుతోంది.
Updated Date - 2023-02-23T18:18:25+05:30 IST