Crime News: 20 ఏళ్ల యువకుడిని తుపాకీతో కాల్చి చంపిన 16 ఏళ్ల యువతి.. ఆరా తీస్తే వెలుగులోకి షాకింగ్ ట్విస్ట్.. ప్రియుడే కానీ..!
ABN, First Publish Date - 2023-04-21T21:37:49+05:30
ప్రేమ వ్యవహారాల్లో యువతుల పట్ల రాక్షసంగా ప్రవర్తించే యువకులు ఉన్న నేటి సమాజంలో ప్రియుళ్లను చంపేసే యువతులు కూడా ఉంటారు. ప్రియుడిపై ఉన్న ప్రేమ.. పలు కారణాల వల్ల కొన్నిసార్లు పగగా మారుతుంటుంది. ఈ క్రమంలో..
ప్రేమ వ్యవహారాల్లో యువతుల పట్ల రాక్షసంగా ప్రవర్తించే యువకులు ఉన్న నేటి సమాజంలో ప్రియుళ్లను చంపేసే యువతులు కూడా ఉంటారు. ప్రియుడిపై ఉన్న ప్రేమ.. పలు కారణాల వల్ల కొన్నిసార్లు పగగా మారుతుంటుంది. ఈ క్రమంలో చాలా మంది దారుణంగా ప్రవర్తిస్తుంటారు. ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకున్న ఘటనే ఇందుకు నిదర్శనం. 20 ఏళ్ల యువకుడిని 16 ఏళ్ల యువతి తుపాకీతో కాల్చి చంపింది. ఆరాతీయగా చివరకు షాకింగ్ వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..
ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) బక్సర్ పరిధి కృష్ణబ్రహ్మ పరిధి అరియాన్ గ్రామ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన చందన్ సింగ్ (20) అనే యువకుడికి ఇదే ప్రాంతానికి చెందిన 16ఏళ్ల యువతితో (young woman) కొన్ని నెలల క్రితం పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కొన్నాళ్లకే ప్రేమగా (love) మారింది. అతడి మాటలు, ప్రవర్తన నచ్చడంతో యువతి త్వరగా అతడికి దగ్గరైంది. ఇంట్లో వారికి తెలీకుండా ఇద్దరూ కలుస్తూ ఉండేవారు. ఇటీవలే చందన తన వద్ద ఉన్న తుపాకీని (gun) ఆత్మరక్షణ కోసం ప్రియురాలికి ఇచ్చాడు. ఇలా వుండగా, ఇటీవల యువతికి అంకిత్ కుమార్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది.
Viral Video: వామ్మో.. ఈ వ్యక్తి టాలెంట్ మామూలుగా లేదుగా.. వీర లెవల్‌లో ఇంగ్లీషులో దంచేస్తున్నాడు..!
చందన్‌కు తెలీకుండా యువతి అంకిత్‌ను కూడా కలుస్తూ ఉండేది. వీరి ముక్కోణపు ప్రేమాయణం (triangle love) చాలా రోజులు సాగింది. ఇటీవల వీరి ప్రియురాలి నిర్వాకం చందన్‌కు తెలిసింది. దీంతో ప్రియురాలిపై (girlfriend) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇకపై అంకిత్‌ను కలవొద్దంటూ హెచ్చరించాడు. అయినా యువతి మాత్రం అతన్ని కలుస్తూ ఉండేది. దీంతో చందన్‌కు, యువతికి మధ్య తరచూ గొడవలు (Quarrels between lovers) జరుగుతూ ఉండేవి. ఈ విషయం ఆమె అంకిత్‌కు చెప్పేసింది. చందన్‌ను చంపేస్తే ఎలాంటి సమస్యా ఉండదని అతను ఆమెకు సలహా ఇచ్చాడు. ఇటీవల యువతి చందన్‌ను పూర్తిగా దూరం పెట్టింది.
ఈ క్రమంలో ఏప్రిల్ 18న యువతి కళాశాలకు వెళ్తుండగా.. మార్గమధ్యలో చందన్ తారసపడ్డాడు. ప్రియురాలిని ఆపి గొడవ పెట్టుకున్నాడు. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఆమె.. బ్యాగులో ఉన్న తుపాకీని బయటికి తీసి చందన్‌ను (girlfriend shot her boyfriend) కాల్చేసింది. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు చందన్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. యువతితో పాటూ ఆమె ప్రియుడి అంకిత్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది.
Updated Date - 2023-04-21T21:49:42+05:30 IST