Viral Video: ఏ మంత్రం వేశాడేమో గానీ.. నాగు పాములను వానపాములను చేసి మరీ.. ఎలా పట్టుకున్నాడో చూడండి..
ABN, First Publish Date - 2023-08-11T21:45:27+05:30
అదిగో పాము..! అన్న మాట వింటే చాలు.. చాలా మంది అది నిజమా, కాదా అని కూడా తెలుసుకోకుండా ఆమడదూరం పరుగెడుతుంటారు. ఇంకొందరు కాస్త ధైర్యం చేసి వాటిని దూరం నుంచి చూస్తుంటారు. మరికొందరు ఇంకాస్త దగ్గరికి వెళ్లి వాటిని తేరిపారా చూసే సాహసం కూడా చేస్తుంటారు. అయితే కొందరు మాత్రం..
అదిగో పాము..! అన్న మాట వింటే చాలు.. చాలా మంది అది నిజమా, కాదా అని కూడా తెలుసుకోకుండా ఆమడదూరం పరుగెడుతుంటారు. ఇంకొందరు కాస్త ధైర్యం చేసి వాటిని దూరం నుంచి చూస్తుంటారు. మరికొందరు ఇంకాస్త దగ్గరికి వెళ్లి వాటిని తేరిపారా చూసే సాహసం కూడా చేస్తుంటారు. అయితే కొందరు మాత్రం ప్రాణాలను లెక్కచేయకుండా వాటిని సునాయాసంగా బంధించి, అడవుల్లో వదిలేస్తుంటారు. పాములను పట్టుకునే స్నేక్ క్యాచర్లలో ఒక్కొక్కరి పద్ధతి ఒక్కోలా ఉంటుంది. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, వైరల్ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తి పాములను పట్టుకునే విధానం చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ‘‘ఈ పాములకు ఏ మంత్రం వేశాడో.. ఏమో’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ చక్కర్లు కొడుతోంది. రెండు నాగు పాములు (Cobras) ఇంటిలోకి చొరబడడంతో స్నేక్ క్యాచర్‌కు (Snake catcher) సమాచారం అందిస్తారు. అక్కడికి చేరుకున్న అతను.. అందరి మాదిరి స్నేక్ క్యాచింగ్ స్టిక్‌తో కాకుండా వెరైటీగా పట్టుకునేందుకు ప్రయత్నిస్తాడు. ఇందుకోసం ముందుగా అతను ప్లాస్టిక్ మగ్గుతో నీటిని తీసుకుని నాగుపాముల వద్దకు వెళ్తాడు. అతన్ని చూడగానే రెండు పాములు ఒక్కసారిగా పడగ విప్పి బుస కొడతాయి. దీంతో అతను పడగ విప్పిన పాము తలపై (Pouring water on the snake head) నీటిని పోస్తాడు. చాలా సేపు అలాగే నీళ్లు పోస్తున్నా అవి మాత్రం ఎటూ కదలకుండా అలాగే ఉండిపోవడం చూసి అక్కడున్న వారంతా షాక్ అయ్యారు.
చేతిని దగ్గరగా పెట్టినా పాములు మాత్రం కాటు వేసే ప్రయత్నం కూడా చేయకుండా.. స్నానం చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నట్లుగా ప్రవర్తిస్తాయి. ఇలా కొద్ది సేపు నీటిని పోసిన అతను... పాములు పరధ్యానంలో ఉన్న సమయం చూసి చాకచక్యంగా ప్లాస్టిక్ డబ్బాలోకి పంపించి బంధించాడు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ‘‘ఈ పాములకు స్నానం చేయడమంటే బాగా ఇష్టమున్నట్లుంది’’.. అని కొందరు, ‘‘ఇదేం టెక్నిక్ అయ్యా.. పాములను కాస్తా.. వానపాములను చేశావ్’’... అంటూ మరికొందరు, ‘‘ఇలాంటి ప్రయోగాలు చేయకపోవడమే మంచిది’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.
Updated Date - 2023-08-11T21:45:27+05:30 IST