ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: పాములతో జాగ్రత్తగా ఉండాలనేది ఇందుకే.. బైక్‌లో వెళ్తున్న ఈ యువకుడు ఎలా చనిపోయాడో చూస్తే..

ABN, First Publish Date - 2023-09-24T17:39:30+05:30

పుట్టిన ప్రతి మనిషీ గిట్టక తప్పదు. చావు ఎప్పుడు, ఏ రూపంలో వస్తుందో ఎవరూ చెప్పలేరు. కొన్నిసార్లు, కూర్చున్న వారు కూర్చున్నట్లుగా, నడుస్తున్న వారు నడుస్తున్నట్లుగా.. నిద్రలో ఉన్న వారు నిద్రలోనే మృత్యు ఒడిలోకి జారుకుంటుంటారు. ఇంకొందరి మరణానికి గల కారణాలు చూస్తే..

పుట్టిన ప్రతి మనిషీ గిట్టక తప్పదు. చావు ఎప్పుడు, ఏ రూపంలో వస్తుందో ఎవరూ చెప్పలేరు. కొన్నిసార్లు, కూర్చున్న వారు కూర్చున్నట్లుగా, నడుస్తున్న వారు నడుస్తున్నట్లుగా.. నిద్రలో ఉన్న వారు నిద్రలోనే మృత్యు ఒడిలోకి జారుకుంటుంటారు. ఇంకొందరి మరణానికి గల కారణాలు చూస్తే.. ఆశ్చర్యం కలుగుతుంటుంది. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంంది. బైకులో వెళ్తున్న ఓ యువకుడు పాము కాటుకు గురై మృతి చెందడం చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.

సోషల్ మీడియాలో విషాద ఘటనకు సంబంధించిన వీడియో (Viral Video) ఒకటి తెగ వైరల్ అవుతోంది. మధ్యప్రదేశ్‌లోని (Madhya Pradesh) ఇండోర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. జన సంచారంలోకి పాము చొరబడిందన్న సమాచారంతో మనీష అనే స్నేక్ క్యాచర్ (Snake Catcher) .. తన స్నేహితుడిని తీసుకుని వెళ్లారు. పామును పట్టుకున్న మనీష్.. దాన్ని అటవీ ప్రాంతంలో వదిలేందుకు బైకులో బయలుదేరాడు. తన స్నేహితుడు బైకు నడుపుతుండగా.. మనీష్ పామును చేతులతో పట్టుకుని వెనుక కూర్చున్నాడు. అయితే మార్గమధ్యలో మనీష్ చేతిపై పాము (snake bite young man) పలుమార్లు కాటు వేసింది. దీంతో అతను తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. గమనించిన మనీష్ స్నేహితుడు బైకును నిలిపేశాడు. అయితే అప్పటికే మనీష్ పరిస్థితి విషమించడంతో కిందకు దిగగానే కుప్పకూలిపోయాడు.

Viral Video: చిప్ప్ తినే అలవాటు మీకు ఉందా..? అసలు వాటిని ఎలా తయారు చేస్తారో ఒక్కసారైనా చూశారా..?

పాము కాటు వేయడం చూసి మనీష్ స్నేహితుడు భయంతో పక్కకు వెళ్లిపోతాడు. కిందపడ్డ మనీష్ కాసేపటికి మళ్లీ పైకి లేస్తాడు. అప్పటికీ పాము అతడి చేతుల్లోనే ఉంటుంది. అయితే అప్పటికే పాము పలుమార్లు కాటు వేయడంతో మరుక్షణంలోనే మళ్లీ కిందపడిపోయాడు. చుట్టు పక్కల వారు అతన్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిచంగా.. అప్పటికే మనీష్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనతో మనీష్ గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు. ‘‘అయ్యో పాపం! ఎంత ఘోరం జరిగింది’’.. అని కొందరు, ‘‘పామును చేతుల్లో పట్టుకోకుండా బ్యాగులో వేసి ఉంటే బాగుండేది’’.. అని మరికొందరు, ‘‘ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి’’.. అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: వామ్మో! ఈ టీచర్ రూటే సపరేటు.. పాఠాలు చెప్పాల్సింది పోయి.. ఏకంగా క్లాస్ రూంలోనే..

Updated Date - 2023-09-24T17:39:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising