ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Snake: బాత్రూంలోకి వెళ్లిన అతడికి పై ప్రాణాలు పైనే పోయాయ్.. అంత పెద్ద పాము.. ఇంట్లోకి ఎలా చేరిందబ్బా..!

ABN, First Publish Date - 2023-07-20T14:45:31+05:30

ఇళ్లల్లోకి విష సర్పాలు చొరబడడం తరచూ చూస్తూ ఉంటాం. తలుపు చాటునో, మంచం కిందనో ఉన్నట్టుండి ఊహించని విధంగా పెద్ద పెద్ద పాములు దర్శనమిస్తుంటాయి. కొన్నిసార్లు మరీ విచిత్రంగా ఫ్రిడ్జ్‌లు, ఇంటి సీలింగ్‌లోనూ బయటపడుతుంటాయి. ఇలాంటి ఘటనలు చూసినప్పుడు.. ఆశ్చర్యంతో పాటూ..

ఇళ్లల్లోకి విష సర్పాలు చొరబడడం తరచూ చూస్తూ ఉంటాం. తలుపు చాటునో, మంచం కిందనో ఉన్నట్టుండి ఊహించని విధంగా పెద్ద పెద్ద పాములు దర్శనమిస్తుంటాయి. కొన్నిసార్లు మరీ విచిత్రంగా ఫ్రిడ్జ్‌లు, ఇంటి సీలింగ్‌లోనూ బయటపడుతుంటాయి. ఇలాంటి ఘటనలు చూసినప్పుడు.. ఆశ్చర్యంతో పాటూ భయం కూడా కలుగుతుంటుంది. ఈ తరహా ఘటనలు ఇటీవల సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. తాజాగా బాత్రూంలో బయటపడ్డ పెద్ద పాము వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘అంత పెద్ద పాము.. ఇంట్లోకి ఎలా చేరిందబ్బా..!’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.

అమెరికాలోని (America) నార్త్ కరోలినాలోని ఓ ఇంట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా నివాసం ఉంటున్న ఓ వ్యక్తికి ఇటీవల విచిత్ర అనుభవం ఎదురైంది. రోజూ లాగే రాత్రి వేళ స్నానం చేసేందుకు బాత్రూంకి వెళ్లాడు. లోపలికి వెళ్లిన కాసేపటికి ఉన్నట్టుండి ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఎటువైపు నుంచి వచ్చిందో, ఎందులో నుంచి వచ్చిందో తెలీదు గానీ.. సడన్‌గా ఓ పెద్ద నల్లటి పాము (snake entered the bathroom) బుసలు కొట్టుకుంటూ బయటికి వచ్చింది. దాన్ని చూడగానే అతడికి పై ప్రాణాలు పైనే పోయాయి. ‘‘వామ్మో! పాము.. పాము’’.. అని అరుస్తూ బయటికి పరుగులు పెట్టాడు.

Woman: ఇన్నాళ్లకు అవకాశం దొరికిందంటూ ఇంట్లోకి వెళ్లి.. కాసేపటికి బయటికి పరుగందుకున్న యువకులు.. ఆమె చేసిన ఒక్క పనితో..

వెంటనే పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించాడు. కాసేపటికి అక్కడికి చేరుకున్న పోలీసులు.. చాలా సేపు శ్రమించి పామును పట్టుకున్నారు. దీంతో ఇంటి యజమానితో పాటూ కుటుంబ సభ్యులంతా.. హమ్మయ్య! అంటూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను.. పోలీసులు తమ సోషల్ మీడియాలో అకౌంట్లలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వార్త తెగ వైరల్ (Viral news) అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ పాము బాత్రూంలో ఫ్రెషప్ అవడానికి వచ్చిందేమో’’.. అంటూ కొందరు, ‘‘మీరు స్పందించిన విధానం చాలా బాగుంది’’.. అంటూ మరికొందరు, ‘‘మీరు నిజమైన హీరో.. దేవుడు మిమ్మల్ని దీవించుగాక’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral: పనస పండ్లు కోసేందుకు చెట్టెక్కాడు.. అనుమానం వచ్చి పాదాల వైపు చూసుకుని చివరకు ఖంగుతిన్నాడు..

Updated Date - 2023-07-20T15:00:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising