Viral Video: అయ్య బాబోయ్! ఈ చెక్క నిచ్చెనకు ఉన్నట్టుండి దయ్యం పట్టిందా.. అలా ఎలా నడుస్తోందీ..
ABN, First Publish Date - 2023-09-03T21:52:58+05:30
ప్రస్తుత కంప్యూటర్ యుగంలో కళ్లతో చూసినా నిజమో కాదో తెలుసుకోలేని పరిస్థితి నెలకొంది. కొన్ని సంఘటనలు చూస్తే మన కళ్లను మనమే నమ్మలేని విధంగా ఉంటాయి. ఇంకొన్నింటిని చూస్తే.. నిజంగా దయ్యాలేమైనా ఉన్నాయా.. అనే సందేహం కలుగుతుంది. ఇలాంటి...
ప్రస్తుత కంప్యూటర్ యుగంలో కళ్లతో చూసినా నిజమో కాదో తెలుసుకోలేని పరిస్థితి నెలకొంది. కొన్ని సంఘటనలు చూస్తే మన కళ్లను మనమే నమ్మలేని విధంగా ఉంటాయి. ఇంకొన్నింటిని చూస్తే.. నిజంగా దయ్యాలేమైనా ఉన్నాయా.. అనే సందేహం కలుగుతుంది. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు ఇటీవల సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా, ఈ తరహా ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. ఉన్నట్టుండి ఓ చెక్క నిచ్చెన నడవడం చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ‘‘అయ్య బాబోయ్! చెక్క నిచ్చెనకు ఉన్నట్టుండి దయ్యం పట్టిందా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) బరేలిలోని ఓ మెడికల్ కళాశాల పోస్టుమార్టం గదిలో ఈ ఘటన చోట చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఓ గదిలో ఉన్నట్టుండి ఊహించని ఘటన చోటు చేసుకుంది. కర్రలతో చేసిన ఓ పెద్ద నిచ్చెన (large stick ladder) గదిలో గోడ పక్కన ఉంటుంది. ఇందులో ఎలాంటి విశేషమూ లేకున్నా.. ఉన్నట్టుండి అది కదలడం చూసి అక్కడున్న వ్యక్తి షాక్ అయ్యాడు. అది కూడా ఎవరూ ముట్టుకోకుండానే.. దయ్యం పట్టినట్లుగా నిచ్చెన అడుగులో అడుగు వేసుకుంటూ ముందుకు వెళ్తుంది.
అచ్చం మనిషి నడిచినట్లుగానే ఆ నిచ్చెన కూడా చూస్తుండగానే ఓ చోటి నుంచి మరో చోటికి వెళ్తుంది. ఈ ఘటన చూసి షాక్ అయిన వ్యక్తి.. వెంటనే ఫోన్ కెమెరాల బంధించాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టంట తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘అరె! ఇది నిజమా లేక గ్రాఫిక్సా’’.. అని కొందరు, ‘‘నిచ్చెనకు ఏ దయ్యమో పట్టినట్లుంది’’.. అని మరికొందరు, ‘‘న్యూటన్ జడత్వ సిద్ధాంతం ప్రకారం.. వాలుగా ఉన్న ఉపరితలంపై వస్తువు కదలడం సహజం’’.. అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ వీడియో ప్రస్తుతం 6లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: ఏనుగు పవర్ ఏంటో ఎప్పుడైనా చూశారా.. అంతెత్తున ఉన్న పనస పండ్లను ఎలా తెంచేసిందో చూడండి..
Updated Date - 2023-09-03T21:52:58+05:30 IST