కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Accident Video: రోడ్డు పక్కన చెట్టును ఢీకొన్న స్కూలు బస్సు.. సీసీ ఫుటేజీ పరిశీలించగా.. చివరకు ఏం తెలిసిందంటే..

ABN, First Publish Date - 2023-12-05T18:54:56+05:30

విద్యార్థులతో బయలుదేరిన స్కూలు బస్సు.. మార్గమధ్యలో ప్రమాదానికి గురైంది. ఉన్నట్టుండి చోటు చేసుకున్న ఈ ఘటనతో చుట్టుపక్కల వారు భయాందోళనకు గురయ్యారు. కొందరు పరుగెత్తుకుంటూ...

Accident Video: రోడ్డు పక్కన చెట్టును ఢీకొన్న స్కూలు బస్సు.. సీసీ ఫుటేజీ పరిశీలించగా.. చివరకు ఏం తెలిసిందంటే..

విద్యార్థులతో బయలుదేరిన స్కూలు బస్సు.. మార్గమధ్యలో ప్రమాదానికి గురైంది. ఉన్నట్టుండి చోటు చేసుకున్న ఈ ఘటనతో చుట్టుపక్కల వారు భయాందోళనకు గురయ్యారు. కొందరు పరుగెత్తుకుంటూ వెళ్లి విద్యార్థులను కాపాడే ప్రయత్నం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఈ ప్రమాదం ఎలా జరిగిందంటే..

పూణేలోని (Pune) వాహోలి ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు (Private school bus) ప్రమాదానికి గురైంది. విద్యార్థులను ఎక్కించుకుని బయలుదేరిన బస్సు మార్గమధ్యలో ఊహించని ప్రమాదంలో చిక్కుకుంది. మార్గమధ్యలో ఉన్నట్టుండి బస్సు స్టీరింగ్ జామ్ కావడంతో బస్సు అదుపు తప్పి.. రోడ్డు పక్కనే ఉన్న (bus hit the tree) చెట్టును ఢీకొట్టింది. ఊహించని ఈ ఘటనతో అక్కడున్నవారంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. చెట్టును బలంగా ఢీకొనడంతో బస్సు ముందు అద్దం ఊడిపోయి ఎదురుగా పార్క్ చేసి ఉన్న బైక్‌కు తగిలింది.

Marriage: పెళ్లికి వచ్చిన బంధువులను అవాక్కయ్యేలా చేసిన వధువు.. కేఎఫ్‌సీ కూడా 50 శాతం డిస్కౌంట్ ఇవ్వడం వెనుక..!

ఆ సమయంలో చెట్టు సమీపంలో ఉన్న వారు.. ఈ ఘటనతో అక్కడి నుంచి పరుగందుకున్నారు. గమనించిన చుట్టుపక్కల వారు పరుగెత్తుకుంటూ వచ్చి బస్సులో ఉన్న విద్యార్థులను కాపాడే ప్రయత్నం చేశారు. ఈ ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులతో పాటూ స్కూలు సిబ్బంది కూడా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న విద్యార్థుల తల్లిదండ్రులంతా ఆస్పత్రికి వద్దకు చేరుకున్నారు. పోలీసులు అక్కడికి చేరుకుని, సీసీ టీవీ ఫుటేజీని పరిశీలించారు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, బస్సు ప్రమాద ఘటన మొత్తం సీసీ కెమెరాలో రికార్డు అయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

Viral: కంగారుగా ఓ కుర్రాడిని ఆస్పత్రికి తెచ్చిన బంధువులు.. ఏమైందని డాక్టర్‌ను అడిగితే ఓ డబ్బాను బయటపెట్టి మరీ..!

Updated Date - 2023-12-05T18:54:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising