ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Crime News: 27 ఏళ్ల సాఫ్ట్ వేర్ ఉద్యోగిపై లైంగిక దాడి.. బస్సులో వెళ్తోంటే బలవంతంగా కిందకు దింపి మరీ..

ABN, First Publish Date - 2023-04-21T16:49:11+05:30

డబ్బుల కోసం కొందరు ఎంతకైనా తెగిస్తున్నారు. మరికొందరు దురలవాట్లకు బానిసలై చోరీలు, దోపిడీలకు తెగబడడం రోజూ చూస్తూనే ఉన్నాం. మరికొందరైతే ఆడ, మగ అనే తేడా లేకుండా దారుణాలకు పాల్పడుతుంటారు. ఇలాంటి ఘటనలు..

ప్రతీకాత్మక చిత్రం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డబ్బుల కోసం కొందరు ఎంతకైనా తెగిస్తున్నారు. మరికొందరు దురలవాట్లకు బానిసలై చోరీలు, దోపిడీలకు తెగబడడం రోజూ చూస్తూనే ఉన్నాం. మరికొందరైతే ఆడ, మగ అనే తేడా లేకుండా దారుణాలకు పాల్పడుతుంటారు. ఇలాంటి ఘటనలు రోజూ ఎక్కడో చోట జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల తమిళనాడులో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. బస్సులో వెళ్తున్న ఐటీ ఉద్యోగి పట్ల కొందరు యువకులు దారుణంగా ప్రవర్తించారు. బస్సులో వెళ్తున్న అతన్ని బలవంతంగా కిందకు దించి మరీ లైంగిక దాడికి పాల్పడ్డారు. స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించిన ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

తమిళనాడులోని తిరుచ్చి జిల్లా (Tamil Nadu Trichy District) మణప్పారై ప్రాంత పరిధికి చెందిన 27 ఏళ్ల ఓ యువకుడు.. ఐటీ ఉద్యోగం (IT job) చేస్తుంటాడు. ఇటీవల అతను ఏదో పని మీద పుత్తానందం నుంచి మణప్పారైకి వెళ్లేందుకు బస్సు ఎక్కాడు. ఇంతవరకూ బాగానే ఉన్నా.. ఇదే బస్సులో ప్రయాణిస్తున్న పండిపేట్లైకు చెందిన అరివళగన్ అనే యువకుడి (young man) కారణంగా ఊహించని సమస్య వచ్చి పడింది. బస్సులో ఏం జరిగిందో ఏమో తెలీదు గానీ.. అరివళగన్ ఉన్నట్టుండి తన స్నేహితులకు ఫోన్ చేశాడు. బస్సులో ఐటీ ఉద్యోగి తనపై దాడి చేశాడని, బస్సు మణప్పారైకి వచ్చేలోపు అక్కడికి రావాలని చెప్పాడు. దీంతో అతడి స్నేహితులు బస్సు కోసం వేచి చూస్తూ ఉన్నారు. బస్సు రాగానే లోపల ఉన్న ఐటీ ఉద్యోగిని బలవంతంగా కిందకు దించి, నిర్వానుష్య ప్రదేశానికి తీసుకెళ్లారు.

Viral Video: వామ్మో.. ఈ వ్యక్తి టాలెంట్ మామూలుగా లేదుగా.. వీర లెవల్‌లో ఇంగ్లీషులో దంచేస్తున్నాడు..!

అక్కడ అతడిపై అంతా కలిసి లైంగిక దాడికి (Indecent behavior) పాల్పడ్డారు. ఈ ఘటనను మొత్తం వీడియో (Video) కూడా తీశారు. తమకు రూ.75వేల నగదు ఇవ్వాలని (Blackmail for money), లేదంటే వీడియోను సోషల్ మీడియాలో (Social media) షేర్ చేస్తామని బెదిరించారు. దీంతో భయపడిపోయిన ఐటీ ఉద్యోగి.. వారు అడిగిన మొత్తాన్ని ఇచ్చేశాడు. అనంతరం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అరివళగన్‌తో పాటూ ముహమ్మద్, అరుణ్‌కుమార్, లియోబ్లాయిడ్, సెంథిల్‌కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో సెంథిల్‌కుమార్ అనే వ్యక్తి గతంలో ఓ బాలికపై (girl) లైంగిక వేధింపులకు పాల్పడినట్లు తెలిసింది. నిందితులపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోద చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.

OYO Rooms: ఓయో రూమ్‌ నుంచి ఓ యువతి ఏడుపులు.. హోటల్‌లో పనిచేసే యువకుడికి డౌట్.. వెళ్లి అడిగితే ఆమె చెప్పింది విని..

Updated Date - 2023-04-21T16:49:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising