Viral Video: విద్యార్థినిలతో కలిసి అదిరిపోయే స్టెప్పులు వేసిన టీచర్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో..!
ABN, First Publish Date - 2023-12-10T10:39:26+05:30
Teacher Dance on Gulabi Sharara: విద్యార్థినిలతో కలిసి టీచర్ డాన్స్ చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ప్రైవేట్ ఆల్బమ్‌లోని 'గులాబీ షరార' (Gulabi Sharara) పై లయబద్దంగా కాళ్లు కదిపారు. చీరకట్టులో టీచర్ డాన్స్‌తో పాటు ఆమె అందం, అభినయం మరింత ఆకట్టుకుంటోంది.
Viral Video: విద్యార్థినిలతో కలిసి టీచర్ డాన్స్ చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియా (Social Media) ను షేక్ చేస్తోంది. ఇటీవల విడుదలైన ఓ ప్రైవేట్ ఆల్బమ్‌లోని 'గులాబీ షరార' (Gulabi Sharara) పై లయబద్దంగా కాళ్లు కదిపారు. చీరకట్టులో టీచర్ డాన్స్‌తో పాటు ఆమె అందం, అభినయం మరింత ఆకట్టుకుంటోంది. అమ్మాయిలందరూ కూడా ఆమెతో పాటు చాలా సింక్‌లో డ్యాన్స్ చేయడం మనం చూడొచ్చు. ఇప్పుడీ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. టీచర్‌తో పాటు విద్యార్థినిలపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇది ఎక్కడ జరిగింది? ఆ టీచర్ పని చేస్తున్న స్కూల్ ఏంటి? అసలు ఎప్పుడు జరిగింది? తదితర వివరాలు తెలియనప్పటికీ ఈ వీడియోను మూడు రోజుల కింద ఇన్‌స్టాగ్రామ్‌లో ఫిట్‌నెస్ ట్రైనర్ కాజల్ అసుదాని పోస్ట్ చేశారు. వీడియో ప్రారంభంలో టీచర్, విద్యార్థినిలు క్లాస్ రూం ముందు నిల్చుని ఉండడం, పాట స్టార్ట్ కాగానే దానికి తగ్గట్టుగా డ్యాన్స్ వేయడం మనం చూడొచ్చు.
ఇది కూడా చదవండి: Tomato: అంతరిక్షంలో కనిపించకుండాపోయిన టమాటా.. 8 నెలల తర్వాత దొరికింది.. అసలేం జరిగిందంటే..!
అలా విద్యార్థినిలతో కలిసి టీచర్ అదిరిపోయే స్టెప్పులు వేసిన ఈ వీడియో ప్రస్తుతం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇప్పటివరకు వీడియోను 34లక్షలకు పైగా మంది వీక్షించారు. అలాగే 2.5లక్షల వరకు లైక్స్ వచ్చి పడ్డాయి. ఇక వీడియో చూసిన నెటిజన్లు అదే స్థాయిలో స్పందిస్తున్నారు. "నాకు చాలా నచ్చింది. ఒక టీచర్‌గా మరో టీచర్ డ్యాన్స్ చూడడం ఆనందంగా ఉంది", "ఇది చాలా క్యూట్‌గా ఉంది", "నేను కూడా అలాంటి గురువుకు అర్హుడినే" అని కామెంట్ చేశారు.
మరిన్ని ప్రత్యేకం వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Updated Date - 2023-12-10T10:40:05+05:30 IST