ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Snake: పాముకు జన్మనిచ్చిన మహిళ.. వైరల్‌గా మారిన వీడియోలు.. ఇది నిజమేనా అని డాక్టర్లను కలిసి అడిగితే..!

ABN, First Publish Date - 2023-07-11T13:52:10+05:30

ఓ మహిళ పామును జన్మనిచ్చిందంటూ (Woman gave Birth to a Snake) వీడియోలు, ఫొటోలు ఇటీవల సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: ఓ మహిళ పామును జన్మనిచ్చిందంటూ (Woman gave Birth to a Snake) వీడియోలు, ఫొటోలు ఇటీవల సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. అది కూడా ఈ ఘటన మన దగ్గర చోటు చేసుకుందని ప్రచారం కావడంతో ఆ వీడియోలు, ఫొటోలు చాలా తక్కవ సమయంలో ఎక్కువ మందికి చేరాయి. ఇక ఈ ఘటనను కొందరు ఉత్తర ప్రదేశ్‌లో (Uttar Pradesh) జరిగిందని అంటే.. మరికొందరు బిహార్, బెంగాల్‌తో పాటు ఇతర కొన్ని రాష్ట్రాలలో అంటూ గట్టిగా ప్రచారం చేశారు. ప్రధానంగా మహిళ కడుపులో పాము బొమ్మతో ఉన్న ఫొటోలు, ఆమెకు డెలవరీ నిర్వహిస్తున్న వైద్య బృందం వీడియో బాగా వైరల్ అయ్యాయి. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఇమేజ్ అంటూ ఫొటోలను నెట్టింట వైరల్ చేశారు.

అయితే, సామాజిక మాధ్యమాల్లో (Social Media) హల్‌చల్ చేస్తున్న ఈ ఘటన తాలూకు వీడియోలు, ఫొటోలు అసలు నిజమేనా? నిజంగా ఇలా ఓ మహిళ పాముకు జన్మనిచ్చిందా? అనే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేయగా ఇదంతా కేవలం పుకారు మాత్రమేనని తేలింది. ఆ ఫొటోలు, వీడియోలను ఎవరో ఎడిట్ చేసి వైరల్‌గా మార్చినట్లు తెలిసింది. అసలు ఇప్పటివరకు ప్రపంచంలోనే ఎక్కడ ఇలాంటి ఘటన చోటు చేసుకోలేదని నిర్ధారణ అయింది. అటు వైద్యులు కూడా ఇలాంటిది జరగడం అసాధ్యమని తేల్చేశారు. మహిళ కడుపున సర్పం జన్మించడం అనేది ఏ విధంగా సాధ్యపడదని డాక్టర్లు తేల్చి చెప్పేశారు.

ఇక వీడియోలో ఓ వైద్య బృందం మహిళకు సిజేరియన్ (Cesarean section) చేయగా, పాము పుట్టినట్లు చూపించడం కూడా పచ్చి అబద్దమని తేలింది. ఇది పాకిస్థాన్‌కు చెందిన ఇతర ఆపరేషన్ తాలూకు వైద్యుల బృందానికి చెందినదిగా గుర్తించడం జరిగింది. కనుక సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నట్లు ఇండియాలోనే కాదు, ప్రపంచంలోనే ఎక్కడ ఏ మహిళ సర్పానికి జన్మనివ్వలేదని ధృవీకరణ అయింది.

Passport: విదేశీ పర్యటనకు పాస్‌పోర్ట్ అనేది తప్పనిసరి.. కానీ, ఈ ముగ్గురికి మాత్రం అది అవసరం లేదు.. వారెవరో తెలుసా..?

Updated Date - 2023-07-11T13:55:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising