ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral: ఒకరిది పాకిస్తాన్.. మరొకరిది భారత్.. లండన్‌లో మీటింగ్.. దీంట్లో వింతేముందనుకుంటున్నారా..? అసలు వీళ్లెవరో తెలిస్తే..!

ABN, First Publish Date - 2023-07-20T18:28:30+05:30

వారిద్దరిదీ ఒక ఊరు కాదు. అలాగని ఒక జిల్లా, రాష్ట్రం.. చివరికి ఒక దేశం కూడా కాదు. ఒకరిదేమో పాకిస్తాన్, మరికొరిదేమో భారత్.. కానీ లండన్‌లో కలుసుకున్నారు. ఆత్మీయంగా పలకరించుకున్నారు. ఈ సందర్భంగా గత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ప్రస్తుతం వీరికి సంబంధించిన ..

వారిద్దరిదీ ఒక ఊరు కాదు. అలాగని ఒక జిల్లా, రాష్ట్రం.. చివరికి ఒక దేశం కూడా కాదు. ఒకరిదేమో పాకిస్తాన్, మరికొరిదేమో భారత్.. కానీ లండన్‌లో కలుసుకున్నారు. ఆత్మీయంగా పలకరించుకున్నారు. ఈ సందర్భంగా గత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ప్రస్తుతం వీరికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అసలు వీళ్లు ఎవరు, ఎందుకు లండన్‌లో కలుసుకున్నారు.. తదితర వివరాల్లోకి వెళితే..

చదువుకున్న రోజులు జీవితాంతం ఓ మధుర జ్ఞాపకంగా మిగిలిపోతుంటాయి. భవిష్యత్తులో చిన్ననాటి మిత్రులు (childhood friends) ఎదురైన సందర్భాల్లో పాత రోజులు ఒక్కసారిగా కళ్ల ముందు గిర్రున తిరుగుతుంటాయి. ఇటీవల భారత్, పాకిస్తాన్‌కు (India and Pakistan) చెందిన ఇద్దరు స్నేహితుల విషయంలో ఇలాగే జరిగింది. భారత్‌కు చెందిన రథిన్ రాయ్ అనే వ్యక్తికి, పాకిస్తాన్‌కు చెందిన అలీ చీమా అనే వ్యక్తికి మధ్య 31 ఏళ్ల క్రితం స్నేహం ఏర్పడింది. వీరిద్దరూ యూకేలోని కేంబ్రిడ్జి యూనివర్సిటీలో (Cambridge University) అప్పట్లో కలిసి చదువుకున్నారు. చదువు పూర్తయిన తర్వాత ఎవరి లైఫ్‌లో వారు బిజీ అయిపోయారు.

Viral Video: వారెవ్వా.. ఏం సీన్ గురూ.. ఓ కాలు లేని బాలిక.. సడన్‌గా నడుచుకుంటూ వస్తోంటే స్కూల్‌లో ఆ పిల్లలంతా చూసి..

అయితే ఇటీవల అనూహ్యంగా ఇద్దరూ లండన్‌లో (London) కలుసుకున్నారు. దీంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ సందర్భంగా ఇద్దరూ కాఫీ తాగుతూ తమ చిన్న నాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. తన మిత్రుడిని కలుసుకున్న సందర్భాన్ని గుర్తు చేస్తూ రథిన్ రాయ్.. తన ట్విట్టర్ ఖాతాలో ఫోటోను షేర్ చేశారు. దీనిపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘‘దేశాలకు సరిహద్దులు ఉంటాయోమో గానీ... స్నేహానికి ఉండవు’’.. అని కొందరు, ‘‘ఆహా! ఇది అపూర్వ కలయిక’’.. అని మరికొందరు, ‘‘వీరి స్నేహం ఎంతో స్వచ్ఛమైనది’’.. అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వార్త ప్రస్తుతం 76వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Snake: బాత్రూంలోకి వెళ్లిన అతడికి పై ప్రాణాలు పైనే పోయాయ్.. అంత పెద్ద పాము.. ఇంట్లోకి ఎలా చేరిందబ్బా..!

Updated Date - 2023-07-20T18:28:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising