Telangana New Secretariat : తెలంగాణ కొత్త సచివాలయంలో హైలైట్స్ ఇవే.. ధగధగా మెరిసిపోతోందహో..
ABN , First Publish Date - 2023-04-23T14:55:05+05:30 IST
తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయ భవన నిర్మాణం (Dr BR Ambedkar) పూర్తయ్యింది...
తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయ భవన నిర్మాణం (Dr BR Ambedkar) పూర్తయ్యింది. 28 ఎకరాల విశాలమైన విస్తీర్ణం.. చుట్టూ 8 ఎకరాల మేర పచ్చదనం.. మధ్యలో ఇంధ్రభవనాన్ని తలపించే నూతన సముదాయం.. తెలంగాణ చారిత్రక, సాంస్కృతిక వారసత్వానికి ప్రతిబింబంగా హైదరాబాద్‌లో ఈ నిర్మాణం జరిగింది. 265 అడుగుల ఎత్తులో, ఆరు అంతస్థులతో, అత్యాధునిక వసతులతో హంగులతో, తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకలా నిలువెత్తుగా నిలిచివెలుగుతోంది సచివాలయం. అయితే అసలు కొత్త సచివాలయం ఎలా ఉంటుంది..? భవనం లోపల ఏమేం ఉన్నాయి..? ఇందులో ఏవేవి సచివాలయానికి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవబోతున్నాయ్..? అని తెలుసుకోవాలని జనాల్లో ఎంతో ఆసక్తి నెలకొంది. ఈ నెల 30న ప్రారంభానికి సిద్ధమవుతుండగా.. ఈ క్రమంలో కేసీఆర్ సర్కార్ అధికారికంగా కొన్ని ఫొటోలను రిలీజ్ చేసింది. సాగర తీరాన పాలనా సౌధం ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో (Social Media) తెగ వైరల్ అవుతున్నాయి. ధగధగల సచివాలయం అదరహో అని జనాలు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
సాగర తీరాన పాలనా సౌధం.. ధగధగా మెరిసిపోతున్న సచివాలయం ఫొటోల కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి..
ఇందులో హైలైట్స్ ఏమిటంటే..!
- ఇండో పర్షియన్ శైలిలో డోమ్‌లు
- భవనంపై మొత్తం 34 గుమ్మటాలు.. తూర్పు, పశ్చిమ వైపుల్లో భవనం మధ్యలో రెండు అతిపెద్ద గుమ్మటాలు, వాటిపై జాతీయ చిహ్నాలు
- సచివాలయం చుట్టూ గ్రీనరీ
- ముఖ్యమంత్రి చాంబర్
- సీఎం కాన్ఫరెన్స్ హాల్
- సింహద్వారం
- ధగధగమంటున్న డైనింగ్ హాల్
- పసిడి వన్నెలో వీఐపీ లాంజ్
- హెలీప్యాడ్ ఇవన్నీ కొత్త సచివాలయానికి హైలైట్స్‌గా నిలిచాయి.