ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Technology: ఇదేం టెక్నాలజీ బాబోయ్.. వాయిస్‌తో ఓ మహిళను ఏమార్చి.. క్షణాల్లోనే రూ.1.40 లక్షలు మటాష్..!

ABN, First Publish Date - 2023-11-21T21:33:18+05:30

ప్రస్తుత టెక్నాలజీ యుగంలో జరగని దాన్ని జరిగినట్లు, జరిగినదాన్ని జరగనట్లు మార్చే వెలుసుబాటు వచ్చేసింది. కొన్ని వీడియోలు, ఫోటోలు చూస్తే మన కళ్లను మనమే నమ్మలేని విధంగా ఉంటాయి. ఇలాంటి సౌలభ్యాన్ని సైబర్ నేరగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. మన చుట్టూ ....

ప్రతీకాత్మక చిత్రం

ప్రస్తుత టెక్నాలజీ యుగంలో జరగని దాన్ని జరిగినట్లు, జరిగినదాన్ని జరగనట్లు మార్చే వెలుసుబాటు వచ్చేసింది. కొన్ని వీడియోలు, ఫోటోలు చూస్తే మన కళ్లను మనమే నమ్మలేని విధంగా ఉంటాయి. ఇలాంటి సౌలభ్యాన్ని సైబర్ నేరగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. మన చుట్టూ నిత్యం చాలా మంది వివిధ రకాలుగా మోసపోవడం చూస్తూనే ఉన్నాం. తాజాగా, ఓ మహిళకు ఇలాంటి అనుభవమే ఎదురైంది. వాయిస్‌తో ఓ మహిళను ఏమార్చి.. క్షణాల్లోనే రూ.1.40 లక్షలు కొల్లగొట్టారు. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు.. ఇదేం టెక్నాలజీ బాబోయ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

హైదరబాద్‌కు (Hyderabad) చెందిన ఓ మహిళకు ఇటీవల షాకింగ్ అనుభవం ఎదురైంది. ఆమె మేనల్లుడు కెనడాలో (Canada) ఉద్యోగం చేస్తున్నాడు. తరచూ ఫోన్ చేస్తూ ఆమెతో మాట్లాడుతూ ఉండేవాడు. అయితే ఆమె ఇంటికి సమీపంలోని వారు ఎలాగైనా ఏదోటి చేసి, ఆమెను బురిడీ కొట్టించి.. డబ్బు దోచుకోవాలని ప్లాన్ చేశారు. చివరకు వారు ఏఐ టెక్నాలజీని (AI technology) ఉపయోగించి, మహిళ మేనల్లుడి వాయిస్‌తో అర్ధరాత్రి ఆమెకు కాల్ చేశారు. తాను ఓ ప్రమాదంలో చిక్కుకున్నానని, జైలుకు వెళ్లే ప్రమాదం కూడా ఉందని చెప్పారు. ఆ కేసు నుంచి బయటపడేందుకు అర్జంటుగా డబ్బులు అవసరమని చెప్పారు.

Woman Constable: ఈ మహిళా కానిస్టేబుల్‌కు ఏమైంది..? కొద్ది రోజుల క్రితమే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది కానీ..!

అవతలి వ్యక్తి గొంతు అచ్చం తన మేనల్లుడి గొంతులాగే ఉండడంతో మహిళ కూడా భయపడిపోయింది. వారు చెప్పిన ఖాతాలోని రూ.1.40 లక్షలను బదిలీ చేసింది. అయితే తర్వాత తన మేనల్లుడి నిజంగానే ఫోన్ చేయడంతో చివరకు విషయం తాను మోసపోయానని తెలుసుకుంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అపరిత వ్యక్తల నుంచి ఫోన్లు వస్తే స్పందించవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. కాగా, ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో (Viral news) తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో ఇదేం టెక్నాలజీ బాబోయ్’’.. అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Bride: 2 రోజుల్లో పెళ్లనగా ఈ వధువుకు ఇలా జరిగిందేంటి..? ఫోన్ చేసి పిలిచాడని కాబోయే భర్త ఇంటికి వెళ్తే..!

Updated Date - 2023-11-22T16:53:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising