ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Auto Driver: ఈ ఆటో డ్రైవర్ డబ్బులు తీసుకోడట.. ఎంత దూరమైనా ఫ్రీగానే తీసుకెళ్తాడట.. కానీ ఒకే ఒక్క కండీషన్ ఏంటంటే..!

ABN, First Publish Date - 2023-05-04T10:22:46+05:30

ముంబైకి చెందిన ఓ ఆటో డ్రైవర్ (Auto Driver) తాలూకు ఫొటో ఒకటి ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: ముంబైకి చెందిన ఓ ఆటో డ్రైవర్ (Auto Driver) తాలూకు ఫొటో ఒకటి ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఆ ఆటో డ్రైవర్ తన వాహనం ఎక్కిన ప్రయాణీకుల నుంచి డబ్బులు తీసుకోకుండానే ఎంత దూరమైనా తీసుకెళ్తానంటున్నాడు. అంటే.. ఫ్రీ జర్నీ అన్నమాట. ఎంత దూరమైనా నయాపైసా ఛార్జీ చెల్లించకుండా ఫ్రీ రైడ్ చెయొచ్చు. అయితే, దీనికి ఆ ఆటో డ్రైవర్ ఒక కండీషన్ పెట్టాడు. ఇంతకీ ఆ కండీషన్ ఏంటి? ఇలా ఫ్రీ రైడ్ పెట్టడం వెనుక అసలు కథేంటి? తదితర వివరాలు తెలుసుకుందాం.

దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఓ మలయాళి సినిమా విడుదలకు ముందే దుమారం రేపుతోంది. అదే.. 'ది కేరళ స్టోరీ' (The Kerala Story). ఈ నెల 5న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే, ఈ మూవీ ట్రైలర్ విడుదలైనప్పటీ నుంచి కాంట్రావర్సీలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. స్వయంగా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఈ సినిమాపై పెదవి విరిచారు కూడా. ఇలాంటి చిత్రాలతో ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారంటూ కడిగిపారేశారు. ఎందుకుంటే ఈ మూవీ 'లవ్ జిహాది' కాన్సెప్ట్‌తో రూపొందింది. ముస్లింమేతర అమ్మాయిలను కిడ్నాప్ చేసి, వారి బ్రైన్‌వాష్ తర్వాత మతమార్పిడికి పాల్పడడం, ఆ తర్వాత వారిని ఐసిస్‌లోకి జాయిన్ చేయడం చూపించారు మూవీ డైరెక్టర్ సుదీప్తో సేన్.

Doctor Tweet: మూడు లడ్డూల ఫొటోను పోస్ట్ చేస్తూ.. ఓ పేషెంట్ గురించి దారుణ నిజాలు చెప్పాడో డాక్టర్.. నాలుగో లడ్డూ ఏమైందంటూ.. !


ఇంతకీ మనం పైన చెప్పుకున్న ఆటో డ్రైవర్‌కు దీంతో ఏం సంబంధం ఉందనేగా మీ అనుమానం. అక్కడికే వస్తున్నాం. ఈ ముంబై ఆటోవాలా ఫ్రీ రైడ్ ఇచ్చేది ఎవరికో తెలుసా? ఇదిగో ఈ సినిమాకు వెళ్లే ప్రేక్షకులకే. అవును మీరు విన్నది నిజమే. 'ది కేరళ స్టోరీ'‌ మూవీకి వెళ్లేవారికి ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యం అంటూ ప్రత్యేకంగా ఆటో వెనకవైపు ఓ బ్యానర్ కూడా పెట్టించాడు. అంతేగాకాదండోయ్.. తన సొంత డబ్బులతో ఓ పది మంది మహిళలకు మూవీ టికెట్లు కూడా ఇప్పిస్తున్నాడట. ప్రధానంగా మహిళల కోసమే ఈ ఫ్రీ రైడ్ సౌకర్యం కల్పించినట్లు డ్రైవర్ చెబుతున్నాడు. అభిషేక్ కుమార్ (Abhishek Kumar) అనే ట్విటర్ యూజర్.. ఆ ఆటో డ్రైవర్‌తో పాటు అతడి వాహనం వెనకవైపు ఉన్నా బ్యానర్‌తో సహా ఫొటో తీసి పోస్ట్ చేశాడు. దీనికి ఆటో డ్రైవర్ చెప్పిన స్టోరీని యాడ్ చేశాడు. దీంతో ప్రస్తుతం ఈ ట్వీట్ తెగ వైరల్ అవుతోంది. ఇప్పటివరకు 22వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. నెటిజన్లు దీనిపై తమదైన శైలిలో స్పందిస్తున్నారు.

Uber Driver: హ్మ్.. నీకు ఇంగ్లీషు కూడా వచ్చా..? ఏం చదువుకున్నావేంటని డ్రైవింగ్ చేస్తున్న యువతిని అడిగిన కస్టమర్.. ఆమె చెప్పింది విని..

Updated Date - 2023-05-04T10:22:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising