కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: దంపతులను దోచుకోవడానికి వచ్చిన దుండగులు.. భర్త జేబు చూసి షాక్.. చివరకు వారు చేసిన పని..

ABN, First Publish Date - 2023-06-27T18:48:07+05:30

దోపిడీలు, దొంగతనాలకు అలవాటు పడిన దుండగులు... కొన్నిసార్లు దారుణాలకు తెగబడుతుంటారు. డబ్బుల కోసం పాపం, పుణ్యం.. ఆడ, మగ అనే తేడా లేకుండా ప్రవర్తిస్తుంటారు. అవరసరమైతే చంపడానికి కూడా వెనుకాడరు. అయితే ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు హాస్యాస్పద ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఈ తరహా...

Viral Video: దంపతులను దోచుకోవడానికి వచ్చిన దుండగులు.. భర్త జేబు చూసి షాక్.. చివరకు వారు చేసిన పని..
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దోపిడీలు, దొంగతనాలకు అలవాటు పడిన దుండగులు... కొన్నిసార్లు దారుణాలకు తెగబడుతుంటారు. డబ్బుల కోసం పాపం, పుణ్యం.. ఆడ, మగ అనే తేడా లేకుండా ప్రవర్తిస్తుంటారు. అవరసరమైతే చంపడానికి కూడా వెనుకాడరు. అయితే ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు హాస్యాస్పద ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఈ తరహా వీడియోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి వైరల్‍‌గా మారింది. దంపతులను దోచుకోవడానికి వచ్చిన దండగులు.. భర్త జేబు చూసి షాక్ అయ్యారు. చివరకు వారు చేసిన పని చూసి అంతా అవాక్కవుతున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) హల్‌చల్ చేస్తోంది. ఢిల్లీలోని (Delhi) షాదారాలోని ఫర్ష్ బజార్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. భార్యాభర్తలు (husband and wife) అర్ధరాత్రి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నారు. నిర్మానుష్య ప్రదేశంలోకి వెళ్లగానే షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. స్కూటీపై వచ్చిన ఇద్దరు దుండగులు వారి వద్దకు వచ్చి ఆపారు. కిందకు దిగి.. అరిస్తే చంపేస్తామంటూ వారిని బెదిరించారు. ఊహించని ఈ ఘటనతో దంపతులిద్దరూ షాక్ అయ్యారు. ‘‘మీ వద్ద ఉన్న నగలు, నగదు మొత్తం ఇచ్చేయండి’’.. అని బెదిరించారు. ఇందుకు వారు ‘‘ మా వద్ద ఏమీ లేదు.. కావాలంటే చెక్ చేసుకోండి’’.. అని అనడంతో దుండగులు దగ్గరికి వెళ్లి పరిశీస్తారు.

Wife: మరదలి ఇంటి నుంచి రాగానే.. భార్యకు చికెన్ వండి పెట్టిన భర్త.. కాసేపటికి స్థానికులు వచ్చి చూడగా షాకింగ్ సీన్..

భర్త జేబులో చూడగా.. కేవలం రూ.20లు ఉండడంతో వారు అవాక్కవుతారు. మధ్యలో బైకులో అక్కడికి వచ్చిన ఓ వ్యక్తిని వారు బెదిరిస్తారు. దీంతో అతను భయపడి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అయితే దంపతుల పరిస్థితి చూసి జాలిపడ్డారో ఏమోగానీ.. చివరకు వారిద్దరికీ రూ.100లు ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతారు. కాగా, విచారణ చేపట్టిన పోలీసులు.. దుండగులను జగత్‌పురిలో అదుపులోకి తీసుకున్నారు. నిందితులను హర్ష్‌ రాజ్‌పుత్‌, దేవ్‌ వర్మలుగా గుర్తించారు. వారి వద్ద నుంచి 30 ఫోన్లు, 1 పిస్టల్, 6 కాట్రిడ్జ్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఇదిలావుండగా, ఈ ఘటనను పక్కనే ఉన్న ఇంటి పైనుంచి ఓ వ్యక్తి వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: కూతురికి ప్రియుడు ఉన్నాడని తెలిస్తే.. నూటికి 95 శాతం మంది తల్లులు ఇలాగే చేస్తారేమో..!

Updated Date - 2023-06-27T18:48:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising