Viral Video: గోడ మీద పులి.. చుట్టూ విచిత్రంగా చూస్తున్న జనం.. చివరకు ఏమైందంటే..
ABN, Publish Date - Dec 26 , 2023 | 02:35 PM
అరణ్యంలో ఉండాల్సిన పులులు, సింహాలు.. అప్పుడప్పుడూ జనారణ్యంలోకి వస్తుంటాయి. ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. కొన్నిసార్లు మనుషులపై దాడి చేసి చంపేయడం కూడా చూస్తూ ఉంటాం. అయితే...
అరణ్యంలో ఉండాల్సిన పులులు, సింహాలు.. అప్పుడప్పుడూ జనారణ్యంలోకి వస్తుంటాయి. ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. కొన్నిసార్లు మనుషులపై దాడి చేసి చంపేయడం కూడా చూస్తూ ఉంటాం. అయితే తాజాగా, ఉత్తరప్రదేశ్‌లో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. అటవీ ప్రాంత సమీప గ్రామంలోకి చొరబడిన పులి.. ఊహించని విధంగా గోడ పైకి ఎక్కింది. ఉదయం గుంపులు గుంపులుగా అక్కడికి చేరుకున్న జనం.. దాన్ని చూస్తూ ఉండిపోయారు. చివరకు ఏమైందంటే..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) కాళీనగర్ పరిధి అటకోన అనే గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ గ్రామంలో సోమవారం రాత్రి ఊహించని ఘటన చోటు చేసుకుంది. సమీప అటవీ ప్రాంతం నుంచి (tiger entered the village) గ్రామంలోకి చొరబడిన ఓ పెద్ద పులి.. ఎవరికీ ఎలాంటి హాని కలిగించలేదు. చివరకు ఊహించని విధంగా గోడ పైకి ఎక్కింది. రాత్రంతా (tiger sleeping on wal) గోడపైనే నిద్రపోయింది. ఉదయం అటుగా వచ్చిన స్థానికులు పులిని చూడగానే భయంతో పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు అక్కడ గుమికూడారు.
అయినా పులి మాత్రం అలాగే పడుకుని ఉండడం చూసి అంతా అవాక్కయ్యారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు అక్కడికి చేరుకుని చుట్టూ వల ఏర్పాటు చేశారు. తర్వాత పులికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి అక్కడి నుంచి తరలించారు. దీంతో గ్రామస్తులు హమయ్య అంటూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ గ్రామానికి సమీపంలో పిల్వట్ అభయారణ్యం ఉంది. దీంతో తరచూ అడవి జంతువులు గ్రామంలోకి చొరబడుతుంటాయని స్థానికులు తెలిపారు. 2015లో పిల్విట్ అభయారణ్యం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటిదాకా సుమారు 50 పులుల వరకూ గ్రామంలోకి చొరబడినట్లు తెలిసింది. గత నాలుగు నెలల్లో పులుల దాడిలో సుమారు ఐదుగురు చనిపోయినట్లు అధికారులు తెలిపారు. కాగా, గోడమీద పడుకున్న పులి వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.
Viral Video: రైలు ఎక్కుతుండగా.. పిల్లలతో సహా కిందపడిన మహిళ.. చివరకు ఎవరూ ఊహించని విధంగా..
Updated Date - Dec 26 , 2023 | 02:36 PM