Horoscope : రాశిఫలాలు

ABN , First Publish Date - 2023-06-10T08:04:59+05:30 IST

నేడు (10-6-2023 - శనివారం) మిథున రాశివారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుందని ప్రముఖ జోతిష్య పండితుడు బిజుమళ్ల బిందుమాధవ శర్మ తెలిపారు.

Horoscope : రాశిఫలాలు

నేడు (10-6-2023 - శనివారం) మిథున రాశివారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుందని ప్రముఖ జోతిష్య పండితుడు బిజుమళ్ల బిందుమాధవ శర్మ తెలిపారు. నేడు కర్కాటక రాశివారికి అంతా బాగానే ఉంది కానీ ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శిస్తే మరింత ప్రయోజనకరంగా ఉంటుందని సూచించారు. ఇక అన్ని రాశుల వారి ఫలితాలు నేడు ఎలా ఉన్నాయో చూద్దాం.

MESHAM-01.jpg

మేషం (మార్చి 21 - ఏప్రిల్‌ 20 మధ్య జన్మించిన వారు)

ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాలకు అనుకూలం. విరామ కాలక్షేలపాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు మనసుకు ఊరటనిస్తాయి. దీర్ఘకాలంగా వాయిదా పడుతున్న పనులు ఒక కొలిక్కి వస్తాయి. రాజకీయ, సినీరంగాల వారికి శుభప్రదం.

MESHAM-02.jpg

వృషభం ( ఏప్రిల్‌ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)

సన్నిహితుల సహకారంతో ఆర్థికపరమైన లక్ష్యాలు సాధిస్తారు. బ్యాంకులు, ఆర్థిక సంస్థల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. సమావేశాల్లో కీలకపాత్ర పోషిస్తారు. వేడుకలకు ఏర్పాట్లు చేస్తారు. షాపింగ్‌ ఉల్లాసం కలిగిస్తుంది. బంధుమిత్రులను కలుసుకుంటారు.

MESHAM-03.jpg

మిథునం (మే 21-జూన్‌ 21 మధ్య జన్మించిన వారు)

పెద్దల సహకారంతో లక్ష్యాలు సాధిస్తారు. ఉన్నత పదవులు అందుకుంటారు. ప్రముఖులను కలుసుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. ప్రభుత్వ సంస్థల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. వేంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి.

MESHAM-04.jpg

కర్కాటకం (జూన్‌ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)

కమ్యూనికేషన్లు, న్యాయ, రక్షణ, బోధన, ఆడిటింగ్‌, ప్రకటనల రంగాల వారికి ప్రోత్సాహకరం. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. సోదరీ సోదరుల విషయాల్లో శుభపరిణామాలు సంభవం. వాహనయోగం వుంది. ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించండి.

MESHAM-05.jpg

సింహం (జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)

పెట్టబడులు లాభిస్తాయి. పన్నులు, బీమా పథకాల చెల్లింపులకు నిధులు సర్దుబాటవుతాయి. రుణాలు మంజూరవుతాయి. మెడికల్‌ క్లెయిముల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. దుర్గా స్త్రోత్ర పారాయణ చేయండి.

MESHAM-06.jpg

కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)

స్పెక్యులేషన్లు లాభిస్తాయి. బ్యాంకులు, వ్యాపార రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరం. శ్రీవారు, శ్రీమతి విషయాల్లో శుభపరిణమాలు సంభవం. వేడుకల్లో బంధుమిత్రులు, ప్రియతములను కలుసుకుంటారు. ఆర్థిక లావాదేవీలకు అనుకూలం.

MESHAM-07.jpg

తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)

ఉద్యోగ వ్యాపారాల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. వైద్యం, హోటల్‌, ఔషధ రంగాల వారికి ప్రోత్సాహకంగా ఉంటుంది. ప్రముఖులను కలుసుకుంటారు.

MESHAM-08.jpg

వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)

వేడుకల్లో పాల్గొంటారు. ప్రేమలు ఫలిస్తాయి. చిన్నారులు, ప్రియతముల వ్యవహారాల్లో శుభపరిణామాలు సంభవం. పెట్టుబడులు లాభిస్తాయు. పన్నులు, చిట్‌ఫండ్‌లు, పొదుపు పథకాల వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించండి.

MESHAM-09.jpg

ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)

రియల్‌ ఎస్టేట్‌ రంగంలోని వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో కుటుంబ సభ్యుల సహకారం ల భిస్తుంది. ఇంటి కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. మరమ్మతులు, హార్డ్‌వేర్‌ రంగాల వారికి శుభప్రదం.

MESHAM-10.jpg

మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)

సోదరీసోదరుల విషయాల్లో శుభపరిణామాలు సంభవం. మెయిల్స్‌, మెసేజ్‌లు ఉల్లాసం కలిగిస్తాయి. ప్రయాణాలు ఫలిస్తాయి. విద్యార్థులు లక్ష్యాలు సాధిస్తారు. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. వాహనాల కొనుగోలుకు అనుకూలం.

MESHAM-11.jpg

కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)

ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు అందుకుంటారు. ఆర్థిక సంస్థలకు చెందిన వారు పట్టుదలతో లక్ష్యాలు సాధిస్తారు. విందు వినోదాలు, సిబ్బంది నియామకాలకు అనుకూలం. రుణాలు మంజూరవుతాయి. ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరం.

MESHAM-FINAL-12.jpg

మీనం (ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)

క్రీడలు, విద్యారంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. టెలివిజన్‌, సినీ రంగాల వారికి ఆర్థికంగా అనుకూల సమయం. పొదుపు పథకాలపై దృష్టి సారిస్తారు. చిన్నారుల విషయాల్లో శుభపరిణామాలు సంభవం. శ్రీ రామచంద్రుడి ఆలయాన్ని దర్శించండి.

- బిజుమళ్ళ బిందుమాధవ శర్

Updated Date - 2023-06-10T08:11:15+05:30 IST