Horoscope : రాశిఫలాలు

ABN , First Publish Date - 2023-06-12T07:58:02+05:30 IST

నేడు (12-6-2023 - సోమవారం) సినిమాలు, రాజకీయాలు, విదేశీ వ్యవహారాలకు చెందిన రంగాల్లో ఉన్న వృషభ రాశివారికి చాలా ప్రోత్సాహకరంగా ఉంటుందట.

Horoscope : రాశిఫలాలు

నేడు (12-6-2023 - సోమవారం) సినిమాలు, రాజకీయాలు, విదేశీ వ్యవహారాలకు చెందిన రంగాల్లో ఉన్న వృషభ రాశివారికి చాలా ప్రోత్సాహకరంగా ఉంటుందట. ఇక సింహరాశివారికి అయితే ఇవాళ పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఇక అన్ని రాశుల వారి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

MESHAM-01.jpg

మేషం (మార్చి 21 - ఏప్రిల్‌ 20 మధ్య జన్మించిన వారు)

విద్యా విషయాలకు సంబంధించి ఒక నిర్ణయానికి వస్తారు. రవాణా, బోధన, కమ్యూనికేషన్లు, స్టేషనరీ రంగాల వారికి సంకల్పం నెరవేరుతుంది. అన్నదమ్ముల వ్యవహారశైలిలో మార్పులు గమనిస్తారు. చేపట్టిన పనులు పూర్తి చేస్తారు.

MESHAM-02.jpg

వృషభం ( ఏప్రిల్‌ 21 - మే 20 మధ్య జన్మించిన వారు)

గతంలో చేసిన శ్రమకు ఫలితం అందుకుంటారు. సినిమాలు, రాజకీయాలు, విదేశీ వ్యవహారాలకు చెందిన రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. దీర్ఘకాలిక పెట్టుబడులు లాభిస్తాయి. ఆధ్యాత్మిక, సేవా రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది.

MESHAM-03.jpg

మిథునం (మే 21-జూన్‌ 21 మధ్య జన్మించిన వారు)

ఆర్థిక విషయాలకు సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. బంధుమిత్రుల కలయిక ఉల్లాసం కలిగిస్తుంది. పెట్టుబడులు, నిధుల సేకరణకు ప్రయత్నాలు ఫలిస్తాయి. బ్యాంకులు ఆర్థిక సంస్థలతో పనులు పూర్తవుతాయి.

MESHAM-04.jpg

కర్కాటకం (జూన్‌ 22 - జూలై 23 మధ్య జన్మించిన వారు)

సినిమాలు, రాజకీయాలు, ప్రభుత్వ రంగాలకు చెందిన వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. గతంలో చేసిన కృషికి ఫలితం అందుకుంటారు. దూరంలో ఉన్న పెద్దల సహకరారంతో లక్ష్యాలు సాధిస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.

MESHAM-05.jpg

సింహం (జూలై 24 - ఆగస్టు 23 మధ్య జన్మించిన వారు)

ఉన్నత విద్య, రక్షణ, న్యాయ, రవాణా రంగాల వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. విద్యాసంస్థల్లో ప్రవేశానికి అనుకూలం. ఆర్థిక విషయాల్లో మీ అంచనాలు ఫలిస్తాయి. సమావేశాల్లో సత్ఫలితాలు సాధిస్తారు. పరమశివుడి ఆరాధన చేయండి.

MESHAM-06.jpg

కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23 మధ్య జన్మించిన వారు)

పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. రుణప్రయత్నాలు, పెట్టుబడుల విషయంలో పెద్దవారి సహకారం లభిస్తుంది. పన్నులు, భీ మా, పెన్షన్‌, గ్రాట్యుటీ వ్యవహారాలకు అనుకూలం. మెడికల్‌ క్లెయిములు మంజూరడుతాయి. శివ పంచాక్షరి జపించండి.

MESHAM-07.jpg

తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23 మధ్య జన్మించిన వారు)

శ్రీవారు, శ్రీమతి విషయాల్లో శుభపరిణామాలు సంభవం. బంధుమిత్రులతో ఉ ల్లాసంగా గడుపుతారు. పందాలు, పోటీల్లో విజయం సాధిస్తారు. జనసంబంధాలు విస్తరిస్తాయి. సమావేశాల్లో ముఖ్య పాత్ర పోషిస్తారు సంకల్పం నెరవేరుతుంది.

MESHAM-08.jpg

వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22 మధ్య జన్మించిన వారు)

ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. పరిశ్రమలు, వ్యవసాయం రంగాల వారికి అ వసరానికి నిధులు సర్దుబాటు అవుతాయి. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లకు అవకాశం ఉంది. శ్రమకు తగిన ఫలితం అందుకుంటారు. శి వాలయాన్ని దర్శించండి.

MESHAM-09.jpg

ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21 మధ్య జన్మించిన వారు)

ప్రేమానుబంధాలు బలపడతాయి. చిన్నారులు, ప్రియతముల విషయంలో శుభపరిణామాలు సంభవం. సినిమాలు, టెలివిజన్‌, క్రీడలు, విద్యా రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది.

MESHAM-10.jpg

మకరం (డిసెంబరు 22-జనవరి 20 మధ్య జన్మించిన వారు)

రియల్‌ ఎస్టేట్‌, నిర్మాణ రంగాల వారికి ప్రోత్సాహరంగా ఉంటుంది. బంధుమిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల ఆ రోగ్యం పట్ల శ్రద్ధ చూపిస్తారు. ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు.

MESHAM-11.jpg

కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19 మధ్య జన్మించిన వారు)

విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. విద్యాసంస్థల్లో ప్రవేశం లభిస్తుంది. ఒక సమాచారం ఆనందం కలిగిస్తుంది. రవాణా, మార్కెటింగ్‌, కమ్యూనికేషన్లు, కాంట్రాక్టులు, అగ్రిమెంట్లకు అనుకూలం. చర్చలు ఫలిస్తాయి. దుర్గాదేవి ఆరాధన శుభప్రదం.

MESHAM-FINAL-12.jpg

మీనం (ఫిబ్రవరి 20 - మార్చి 20 మధ్య జన్మించిన వారు)

గృహనిర్మాణం, స్థల సేకరణకు అవసరమైన నిధులు సర్దుబాటవుతాయి. ఆర్థిక విషయాల్లో మీ వైఖరిని సమీక్షించుకుంటారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పెట్టుబడులు లాభిస్తాయి. కుటుంబ సభ్యుల కోసం ఖ ర్చు చేస్తారు.

- బిజుమళ్ళ బిందుమాధవ శర్మ

Updated Date - 2023-06-12T08:02:10+05:30 IST