Indian Railway: రైళ్లలో బాత్రూమ్‌లు ఎలా పెట్టారో తెలుసా? 1919లో ఓ వ్యక్తి రాసిన లేఖను చూసి బ్రిటీష్ ప్రభుత్వం ఏం చేసిందంటే..
ABN , First Publish Date - 2023-11-03T20:35:52+05:30 IST
సుదూర ప్రయాణాలు చేయాలనుకున్నప్పుడు చాలా మందికి మొదటిగా గుర్తుకొచ్చేవి రైళ్లు మాత్రమే. బస్సులు, విమానాలతో పోల్చితే రైలు ప్రయాణం చాలా తక్కువ ఖర్చుతో, సురక్షితంగా, సౌకర్యవంతంగా ఉంటుంది. రైలులోనే ఆహారం, నీరు, తినడానికి రకరకాల ఆహార పదార్థాలు లభిస్తాయి.
సుదూర ప్రయాణాలు చేయాలనుకున్నప్పుడు చాలా మందికి మొదటిగా గుర్తుకొచ్చేవి రైళ్లు (Trains) మాత్రమే. బస్సులు, విమానాలతో పోల్చితే రైలు ప్రయాణం (Train Journey) చాలా తక్కువ ఖర్చుతో, సురక్షితంగా, సౌకర్యవంతంగా ఉంటుంది. రైలులోనే ఆహారం, నీరు, తినడానికి రకరకాల ఆహార పదార్థాలు లభిస్తాయి. కాలకృత్యాలు తీర్చుకోవడానికి, ఫ్రెష్ అవడానికి రైళ్లలో బాత్రూమ్‌లు కూడా ఉంటాయి. అయితే రైళ్లలో బాత్‌రూమ్‌లు (Toilets in Trains) ఎప్పుడు ఏర్పాటు చేశారో తెలుసా? నిజం చెప్పాలంటే 1919లో ఓ వ్యక్తి రాసిన లేఖ కారణంగా బ్రిటీష్ ప్రభుత్వం రైళ్లలో బాత్రూమ్‌లు ఏర్పాటు చేసింది (Viral Story).
ఓఖిల్ చంద్ర సేన్ అనే వ్యక్తి 1919లో రైలులో అహ్మద్‌పూర్ స్టేషన్ వరకు ప్రయాణించాడు. ఆ ప్రయాణంలో అతడు కడుపు ఉబ్బిపోయి చాలా ఇబ్బంది పడ్డాడు. దీంతో తను ఎదుర్కొన్న ఇబ్బందిని వివరిస్తూ బ్రిటీష్ ప్రభుత్వానికి (Letter to British Government) ఓ లేఖ రాశాడు. ``డియర్ సర్.. నేను రైలులో అహ్మద్‌పూర్ స్టేషన్ వరకు ప్రయాణించాను. ఆ సమయంలో నేను విసర్జనకు వెళ్లాల్సి వచ్చింది. నేను ఓ స్టేషన్‌లో టాయిలెట్‌కు వెళ్లాను. అయితే నేను అక్కడ ఉండగానే రైలు స్టార్ట్ అయింది. గార్డు నన్ను పట్టించుకోలేదు. ఒక చేతిలో కుండ, మరో చేత్తో ధోతిని పట్టుకుని రైలు కోసం ప్లాట్‌ఫామ్‌పై పరిగెత్తాను. ఆ సమయంలో నా పంచె ఊడిపోయింది.
Viral Video: అది బొమ్మ అనుకుందా ఏంటి? విష సర్పంతో కోతి ఎలా ఆడుతోందో చూడండి.. వీడియో చూసి షాకవుతున్న నెటిజన్లు!
అక్కడ ఉన్న స్త్రీలు, పురుషుల ముందు నేను సిగ్గుపడవలసి వచ్చింది. నేను నా రైలును కూడా మిస్ అయ్యాను. నేను అహ్మద్‌పూర్ స్టేషన్‌లోనే ఉండిపోయాను. టాయిలెట్‌కు వెళ్లిన ఓ ప్రయాణికుడి కోసం రైలు గార్డు కొన్ని నిమిషాలు కూడా ఆగకపోవడం బాధాకరం. అతడికి వెంటనే జరిమానా విధించాలని కోరుతున్నాను`` అని లేఖ రాశాడు. ఈ లేఖ చదివిన బ్రిటిష్ వారు రైళ్లలో టాయిలెట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. అలా ఓఖిల్ చంద్ర సేన్ కారణంగా, భారతీయ రైళ్లలో టాయిలెట్ సౌకర్యాలు మొదలయ్యాయి.