ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Instagram Love: ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ట్రయాంగిల్ లవ్ స్టోరీ.. ఫోన్‌లో యువతి వీడియో చూడగానే మారిన సీన్.. చివరకు..

ABN, Publish Date - Dec 30 , 2023 | 07:43 PM

ప్రేమ వ్యవహారాలు కొన్నిసార్లు చిత్రవిచిత్రమైన మలుపులు తీసుకుంటుంటాయి. ఈ మలుపులు చాలాసార్లు విషాదాంతం అవుతుంటాయి. ఇక ట్రయాంగిల్ లవ్ స్టోరీల్లో ఇలాంటి ఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటుంటాయి. తాజాగా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రేమ వ్యవహారాలు కొన్నిసార్లు చిత్రవిచిత్రమైన మలుపులు తీసుకుంటుంటాయి. ఈ మలుపులు చాలాసార్లు విషాదాంతం అవుతుంటాయి. ఇక ట్రయాంగిల్ లవ్ స్టోరీల్లో ఇలాంటి ఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటుంటాయి. తాజాగా, ఢిల్లీలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా మొదలైన ట్రయాంగిల్ లవ్ స్టోరీ చివరకు ఓ యువకుడి హత్యకు దారి తీసింది. వివరాల్లోకి వెళితే..

ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) ఘజియాబాద్ ప్రాంతానికి చెందిన మహిర్ (20) అనే యువకుడు.. ఢిల్లీలోని పహర్‌గంజ్‌లోని ఫ్లెక్స్ ప్రింటింగ్ షాపులో పని చేసేవాడు. ఇలావుండగా ఇతడికి కొన్ని నెలల కిందట 21 ఏళ్ల యువతితో ఇన్‌స్టాగ్రామ్‌లో (man meets young woman on Instagram) పరిచయం ఏర్పడింది. అలాగే ఇదే ప్రాంతానికి చెందిన జనరల్ స్టోర్ యజమానికి అయిన అర్మాన్ యువకుడు కూడా సదరు యువతితో స్నేహం చేశాడు. వీరిద్దరూ ఆమెపై ప్రేమ పెంచుకున్నారు. అయితే ఇటీవల మహిర్.. సదరు యువతితో వీడియో కాల్ చేసి మాట్లాడుకున్నారు. యువతి మహిర్‌తో సన్నిహితంగా ఉండడాన్ని చూసి అర్మాన్ తట్టుకోలేకపోయాడు.

Crime News: ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయిన కారు.. బైకులో వచ్చి వెనుకే ఆగిన యువకులు.. కాసేపటి తర్వాత ఏం జరిగిందంటే..

యువతికి వద్ద ఉన్న ఫోన్ లాక్కుని, అందులోని వీడియో చూడగానే ఆ కోపం కాస్త మరింత పెరిగింది. ఎలాగైనా మహిర్‌ను అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. తన స్నేహితులైన ఫైసల్, సమీర్ అనే యువకులను పిలిచి ఇదే విషయం చెప్పాడు. ముగ్గురూ కలిసి మహిర్ హత్యకు కుట్ర పన్నారు. వీడియో ఉన్న ఫోన్ తిరిగి ఇస్తామని చెబుతూ మహిర్‌ను భాగీరథీ విహార్ ప్రాంతానికి పిలిపించారు. అక్కడ ముగ్గురూ కలిసి అతడిపై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు. కడుపులో పలుమార్లు పొడవడంతో మహిర్ అక్కడికక్కడే మృతి చెందాడు. తర్వాత నిందితులు మహిర్ మృతదేహాన్ని రోడ్డు పక్కన పడేసి అక్కడి నుంచి పరారయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఎట్టకేలకు ముగ్గురు నిందితులనూ అరెస్ట్ చేశారు. నిందితుల్లో ఆర్మార్ జనరల్ స్టోర్ యజమాని కాగా, ఫైసల్ టీవీ మెకానిక్‌గా, సమీర్ స్క్రాప్ డీలర్‌గా పని చేస్తుంటారని పోలీసులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.

Viral: ఇది మరీ దారుణం.. ఫొటోషూట్ పేరుతో హద్దులు దాటిన టీచర్.. విద్యార్థిని ముద్దు పెట్టుకుని మరీ..

Updated Date - Dec 30 , 2023 | 07:43 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising