ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Death Mystery: తెల్లారేసరికి ఇద్దరు పిల్లల మృతి.. రాత్రి పడుకునే ముందు నూడిల్స్‌తో పాటు వీటిని కూడా తినడం వల్లేనా..?

ABN, First Publish Date - 2023-06-30T21:12:26+05:30

ముగ్గురు పిల్లలతో సందడిగా ఉండే ఆ ఇంట్లో అంతలోనే ఇంతటి విషాదం చోటు చేసుకుంటుందని ఎవరూ ఊహించలేదు. అప్పటిదాకా సంతోషంగా ఉన్న పిల్లలు రాత్రి పడుకునే ముందు నూడిల్స్‌ను ఎంతో ఇష్టంగా తిన్నారు. అయితే ఇదే వారి చివరి రాత్రి అవుతుందని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముగ్గురు పిల్లలతో సందడిగా ఉండే ఆ ఇంట్లో అంతలోనే ఇంతటి విషాదం చోటు చేసుకుంటుందని ఎవరూ ఊహించలేదు. అప్పటిదాకా సంతోషంగా ఉన్న పిల్లలు రాత్రి పడుకునే ముందు నూడిల్స్‌ను ఎంతో ఇష్టంగా తిన్నారు. అయితే ఇదే వారి చివరి రాత్రి అవుతుందని తల్లిదండ్రులు ఊహించలేకపోయారు. తెల్లారేసరికి ఇద్దరు పిల్లలు మృతి చెందడంతో అంతా బోరున విలపించారు. నూడిల్స్‌తో వాటిని కూడా తినడంతోనే ఇలా జరిగిందని గ్రామస్తులు కన్నీటిపర్యంతమయ్యారు. స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

హర్యానా (Haryana) సోనేపట్ పరిధి కలుపూర్ గ్రామ సమీపంలోని మాయాపురి కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. భూపేంద్ర అనే వ్యక్తికి.. భార్య, హేమ(7), తరుణ్ (5), ప్రవేశ్ (8) అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. పిల్లలతో నిత్యం సందడిగా ఉండే వీరి ఇంట్లో.. ఇటీవల ఎవరూ ఊహించని ఘటన చోటు చేసుకుంది. బుధవారం రాత్రి భార్యా, పిల్లలు అంతా బయట దుకాణానికి వెళ్లి నూడుల్స్ (Noodles) తెచ్చుకున్నారు. ఇంట్లో నూడుల్స్ చేసుకున్న తర్వాత.. పరోటాలతో (Parotta) కలిపి తిన్నారు. అనంతరం అంతా నిద్రకు ఉపక్రమించారు. అయితే కాసేపటికి నలుగురూ తీవ్ర అస్వస్థతకు (severe illness) గురయ్యారు. దీంతో వారిని వెంటనే చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.

Bride: అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే ఈ యువతి పెళ్లి నిన్న జరిగి ఉండేది.. కానీ సరిగ్గా వివాహానికి రెండ్రోజుల ముందు..!

అయితే ఆరోగ్యం విషమించడంతో మెరుగైన చికిత్స కోసం మరో ఆస్పత్రికి రెఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ హేమ, తరుణ్ మృతి చెందారు. మిగిలిన ఇద్దరూ చికిత్స పొందుతున్నారు. వీరిలో బాలుడు ప్రవేశ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. నూడుల్స్, పరోటాలు తినడం వల్లే ఇలా జరిగిందని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు.. మృతదేహాలను పోస్టుమార్టం (Postmortem) నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పరోటాలలో కల్తీ జరిగిందా లేక న్యూడిల్స్‌లో లోపం ఉందా అనే విషయం ఇంకా తెలియరాలేదని, పోస్టుమార్టం నివేదిక వస్తేగానే అసలు వాస్తవం తెలియదని పోలీసులు తెలిపారు. ఇద్దరు పిల్లల మృతితో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.

Missing Mystery: ఒక్క అబద్ధం విలువ 4 కోట్ల రూపాయలు.. ఓ భార్యకు వచ్చిన డౌట్‌తో బయటపడిన ‘మరణ శాసనం’..!

Updated Date - 2023-06-30T21:12:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising