ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Accident Video: వేగంగా వచ్చి ఢీకొట్టి.. ట్రక్కు కిందకు సగం ఇరుక్కుపోయిందో కారు.. ఆ డ్రైవర్‌ ఏం చేశాడో చూడండి..!

ABN, First Publish Date - 2023-09-16T16:15:47+05:30

ఎక్కువ శాతం రోడ్డు ప్రమాదాలు వాహనదారుల నిర్లక్ష్యం వల్లే జరుగుతుంటాయి. కొందరు మద్యం తాగి వాహనాలు నడపడం, మరికొందరు త్వరగా గమ్యస్థానం చేరాలనే తొందరలో ఇష్టమొచ్చినట్లు వాహనాలు నడుపుతుంటారు. ఇలాంటి వారి వల్ల మిగతా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. కొన్నిసార్లు...

ఎక్కువ శాతం రోడ్డు ప్రమాదాలు వాహనదారుల నిర్లక్ష్యం వల్లే జరుగుతుంటాయి. కొందరు మద్యం తాగి వాహనాలు నడపడం, మరికొందరు త్వరగా గమ్యస్థానం చేరాలనే తొందరలో ఇష్టమొచ్చినట్లు వాహనాలు నడుపుతుంటారు. ఇలాంటి వారి వల్ల మిగతా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. కొన్నిసార్లు ఎవరో చేసిన తప్పు కారణంగా ఇంకెవరే ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఎదురవుతుంటుంది. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ ప్రమాదానికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ కారు వేగంగా వచ్చి ట్రక్కును ఢీకొట్టి కింద ఇరుక్కపోయింది. అయితే చివరకు ట్రక్కు డ్రైవర్ చేసిన పనికి నెటిజన్లు షాక్ అవుతున్నారు.

సోషల్ మీడియలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. తప్పెవరిదో తెలీదు గానీ.. వేగంగా వస్తున్న కారు (car collided with truck) ఓ పెద్ద ట్రక్కును ఢీకొట్టింది. మధ్యలో ఢీకొట్టడంతో కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో కారు ట్రక్కు కింద ఇరుక్కుపోయింది. అయితే ఇంత పెద్ద ప్రమాదం జరిగినా.. ట్రక్కు డ్రైవర్ మాత్రం ఏమీ జరగనట్లుగా యథావిధిగా లారీని నడుపుతున్నాడు. అందులోనూ అత్యంత వేగాంగా వెళ్తున్నాడు. ట్రక్కు కింద ఇరుక్కున్న కారు (car stuck under a truck) లారీతో పాటే వెళ్లింది. సుమారు 2కిలోమీటర్ల మేర కారును లాక్కెళ్లినట్లు తెలిసింది. ఈ ఘటనను వెనుకే వస్తున్న వాహనదారులు చూసి అవాక్కయ్యారు.

Viral News: వరల్డ్ రికార్డు కొట్టి గిన్నీస్ బుక్కులోకి ఎక్కేసిందిగా.. అసలు ఇంతకీ ఇదేంటో తెలిస్తే నివ్వెరపోవడం ఖాయం..!

ఈలోగా దెబ్బతిన్న కారులో ముందు వైపు కూర్చున్న మహిళ.. ‘‘కాపాడండి.. కాపాడండి’’.. అంటూ వాహనదారులకు చేయి చూపిస్తూ కేకలు పెట్టడం వీడియోలో కనిపించింది. దీంతో వీడియో తీస్తున్న వారు మరింత వేగంగా వెళ్లి.. ట్రక్కును ఆపే ప్రయత్నం చేస్తారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో! ఇలాంటి ప్రమాదం ఎక్కడా చూల్లేదు’’.. అని కొందరు, ‘‘కారులోని వారి టైం బాగుంది’’.. అని మరికొందరు, ‘‘ఈ ట్రక్కు డ్రైవర్ మరీ విచిత్రంగా ఉన్నాడే’’.. అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 6వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: నిండా పదేళ్లు కూడా లేవు.. ఇంత టాలెంట్ ఏంటి తల్లీ..? ఇంగ్లీషు పాఠాలు ఎలా చెప్పేస్తోందో మీరే చూడండి..!

Updated Date - 2023-09-16T16:15:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising