Viral Video: గాలి బుడగలను ప్లేట్‌లో వడ్డిస్తున్న చెఫ్.. ఇదేం ఫుడ్ అంటూ ఆశ్చర్యపోతున్న నెటిజన్లు..

ABN, First Publish Date - 2023-03-19T19:17:02+05:30

మనకి తెలిసిన ఆహార పదార్థాలు చాలా ఉన్నా.. తెలీని పదార్థాలు ఇంకా ఎన్నో ఉన్నాయనే విషయం వెలుగులోకి వచ్చినప్పుడు తెలుస్తుంటుంది. కొన్ని ప్రాంతాలు, రాష్ట్రాలు, దేశాల్లో వారు తినే ఆహారం చూసినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంటుంది. అలాంటప్పుడు..

Viral Video: గాలి బుడగలను ప్లేట్‌లో వడ్డిస్తున్న చెఫ్.. ఇదేం ఫుడ్ అంటూ ఆశ్చర్యపోతున్న నెటిజన్లు..
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

మనకి తెలిసిన ఆహార పదార్థాలు చాలా ఉన్నా.. తెలీని పదార్థాలు ఇంకా ఎన్నో ఉన్నాయనే విషయం వెలుగులోకి వచ్చినప్పుడు తెలుస్తుంటుంది. కొన్ని ప్రాంతాలు, రాష్ట్రాలు, దేశాల్లో వారు తినే ఆహారం చూసినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంటుంది. అలాంటప్పుడు, ఇలాంటి ఫుడ్ కూడా ఉంటుందా.. అని అనిపిస్తుంటుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ పెద్ద హోటల్లో (big hotel) చెఫ్ వడ్డించిన గాలిబుడగలను చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఇదేం ఫుడ్ అంటూ చర్చించుకుంటున్నారు. ఈ వీడియో (Food videos) ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.

సోషల్ మీడియాలో వింత ఆహారానికి సంబంధించిన వీడియో వైరల్ (Viral video) అవుతోంది. ఓ ఖరీదైన హోటల్లో చెఫ్‌లు (chef) వారి వారి పనుల్లో బిజీ బిజీగా ఉంటారు. ఇంతలో ఓ చెఫ్ చేసిన పని అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. చేతిలో రెండు స్టిక్‌లతో వచ్చిన చెఫ్.. అక్కడ ఏర్పాటు చేసిన ప్రత్యేక పరికరం నుంచి కొన్ని గాలి బుడగలను (air bubbles) బయటికి తీస్తాడు. ఆ బుడగలన్నీ గాల్లోకి లేచి ఓ ఆకారాన్ని సంతరించుకుంటాయి. వాటిని స్టిక్‌లతో అటూ ఇటూ తిప్పుతూ కాసేపు విన్యాసం చేస్తాడు. అయినా ఆ గాలిబుడగలను విడిపోకుండా అలాగే ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

Viral Video: మరీ ఇంత ఆత్మవిశ్వాసం పనికిరాదు బ్రదర్.. ఇతడు చేసిన విన్యాసం.. చివరకు ఏమైందో చూడండి..

తర్వాత వాటిని అప్పటికే సిద్ధంగా ఉన్న ప్టేట్‌లో అలంకరిస్తాడు. వారు చెప్పినదాన్ని బట్టి.. ఆ బుడగలు హీలియంతో (Helium) ఏర్పడినట్లు తెలుస్తోంది. వాటిని ఖరీదైన డిష్‌కు (expensive dish) ప్లేవర్ కోసం వినియోగిస్తున్నట్లుగా తెలిసింది. ఈ వీడియో మాత్రం ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. ధనవంతుల కోసం ప్రత్యేకంగా సబ్బుతో చేసిన నురగలు.. అంటూ కొందరు, భూమిపై తక్కువగా ఉన్న హీలియంను ఇలాంటి పనులకు ఉపయోగించడం ఏంటని.. మరికొందరు, ఇది చాలా వెరైటీగా ఉందటూ.. ఇంకొందరు కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షల్లో వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: బూర ఊదగానే నాట్యమాడుతూ బుసకొట్టిన కోబ్రా.. పట్టుకునేలోపు కాటేయడంతో చివరకు వారు చేసిన పని..

Updated Date - 2023-03-19T19:32:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising