ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Snake Video: అమ్మ బాబోయ్.. చూస్తోంటేనే వెన్నులో వణుకుపుడుతోందిగా.. ఓ చిన్న పాప.. పాము తోకను పట్టుకుని..!

ABN, First Publish Date - 2023-07-29T16:48:38+05:30

నా పుట్టలో వేలు పెడితే కుట్టనా.. అన్న సమెతను పాములు మాత్రం తూచాతప్పకుండా పాటిస్తుంటాయి. వాటి మానాన అవి వెళ్లే పాములు.. ఎవరైనా మీదకు వస్తే మాత్రం ప్రాణ రక్షణలో భాగంగా కాటేస్తుంటాయి. అయితే కొన్నిసార్లు కొన్ని పాములు మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా ప్రవర్తిస్తుంటాయి. ఎంత విసిగించినా...

నా పుట్టలో వేలు పెడితే కుట్టనా.. అన్న సమెతను పాములు మాత్రం తూచాతప్పకుండా పాటిస్తుంటాయి. వాటి మానాన అవి వెళ్లే పాములు.. ఎవరైనా మీదకు వస్తే మాత్రం ప్రాణ రక్షణలో భాగంగా కాటేస్తుంటాయి. అయితే కొన్నిసార్లు కొన్ని పాములు మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా ప్రవర్తిస్తుంటాయి. ఎంత విసిగించినా మిన్నకుండిపోతుంటాయి. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ చిన్నారికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ చిన్న పాప పాము తోక పట్టుకుని ఆడుకుంటున్న వీడియో చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. పిల్లలకు ఇలాగేనా నేర్పించేది.. అంటూ మరికొందరు మండిపడుతున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ హల్‌చల్ చేస్తోంది. రోడ్డుపై పాకుతూ వెళ్తున్న పామును చూసిన ఓ పాప.. పరుగెత్తుకుంటూ దాని వద్దకు వెళ్తుంది. ఏమాత్రం భయం లేకుండా పారిపోతున్న పాము తోకను పట్టుకుని (child playing with snake) ఆడుకుంటాడు. ఈ క్రమంలో పాము తప్పించుకుని అక్కడి నుంచి దూరంగా వెళ్లిపోయేందుకు ప్రయత్నిస్తుంది. అయినా ఆ చిన్నారి దాన్ని వదలకుండా తోక పట్టుకుని వెనక్కు లాగేస్తుంటాడు. అయినా పాము మాత్రం చిన్నారికి ఎలాంటి హానీ కలిగించదు.

Viral Video: మీరు రోజూ ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేస్తుంటారా.. అయితే ఈ డెలివరీ బాయ్ చేసిన పని చూస్తే షాకవుతారు..

చాలా సేపు పాముతో ఆడుకున్న పాప తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోతుంది. కాగా, ఈ ఘటనను చిన్నారి కుటుంబ సభ్యులు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో! ఈ పాపకు ఎంత ధైర్యం’’.. అంటూ కొందరు, ‘‘ఈ పాపతో పాముకు మంచి స్నేహం ఉన్నట్టుంది’’ అని మరికొందరు, ‘‘చిన్న పిల్లలతో ఇలాంటి పనులు చేయించడం ప్రమాదం’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 80వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: కొన్ని నెలలుగా మంచంపై పడుకోవడానికే భయపడుతున్న ఆర్మీ అధికారి.. చివరకు కేర్ టేకర్ వెళ్లి పరుపు కింద పరిశీలించగా..

Updated Date - 2023-07-29T16:48:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising