ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Snake Video: నడిరోడ్డుపై నాగుపాము.. వెళ్లిపోతోంది కదా అని దాని పక్కనుంచే బైక్‌పై ఇద్దరు కుర్రాళ్లు దూసుకెళ్తోంటే..!

ABN, First Publish Date - 2023-08-02T15:53:35+05:30

‘‘ఇక్కడ, అక్కడ అని కాదు.. ఎక్కడ చూసినా కనిపిస్తా’’.. అన్నట్లుగా కొన్నిసార్లు విష సర్పాలు ఊహించని ప్రదేశాల్లో దర్శనమిస్తుంటాయి. తలుపు చాటున, ఇంటి పైకప్పు, పరుపులు, ఫ్రిడ్జ్‌లలోనే కాకుండా ఆఖరికి బూట్ల నుంచి కూడా బుసలు కొడుతూ బయటకు వస్తుంటాయి. ఇలాంటి వీడియోలు...

‘‘ఇక్కడ, అక్కడ అని కాదు.. ఎక్కడ చూసినా కనిపిస్తా’’.. అన్నట్లుగా కొన్నిసార్లు విష సర్పాలు ఊహించని ప్రదేశాల్లో దర్శనమిస్తుంటాయి. తలుపు చాటున, ఇంటి పైకప్పు, పరుపులు, ఫ్రిడ్జ్‌లలోనే కాకుండా ఆఖరికి బూట్ల నుంచి కూడా బుసలు కొడుతూ బయటకు వస్తుంటాయి. ఇలాంటి వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది. నడి రోడ్డుపై ఓ నాగుపాము ఇద్దరు యువకులకు షాక్ ఇచ్చింది. వెళ్లినట్లే వెళ్లి చివరకు ఏం చేసిందో చూడండి..

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. నాగు పాము రోడ్డుపై (Cobra on the road) వెళ్తూ మధ్యలో ఉన్నట్టుండి ఊహించని కదలకుండా అలాగే పడుకుని, తర్వాత మెల్ల మెల్లగా వెళ్తూ ఉంటుంది. అదే సమయంలో ఇద్దరు యువకులు బైకులో అటుగా వెళ్తుంటారు. పామును చూసి రోడ్డు దాటి వెళ్లిపోతుందిలే అనుకుని.. వాహనాన్ని దానికి దగ్గరగా పోనిస్తారు. అయితే తీరా పాము దగ్గరికి వెళ్లగానే.. అటుగా వెళ్తున్న పాము కాస్తా.. వెంటనే వెనక్కు తిరిగి పడగ విప్పి (cobra attacked a bike) బైకు వైపు వేగంగా వెళ్తుంది. కాటు వేసే సమయంలో యువకులు చాకచక్యంగా తప్పించుకుని వేగంగా ముందుకు దూసుకెళ్తారు.

Marriage: పెళ్లీడుకొచ్చిన కుర్రాళ్లూ.. జర జాగ్రత్త.. మేట్రిమోనీలో ప్రొఫైల్ పెట్టిన ఓ యువకుడికి ఏమైందంటే..

కాస్త ముందుకు వెళ్లిన యువకులు.. అనుమానం వచ్చి వెనక్కు తిరిగి చూసి షాక్ అవుతారు. ఆ సమయంలో పాము ఎంతో ఆవేశంగా వారి వైపు చూస్తున్నట్లు కనిపిస్తుంది. ‘‘ఇంకోసారి ఇటు రాకపోతారా.. నాకు దొరక్కపోతారా’’.. అన్నట్లుగా పాము కొద్ది సేపు వారి వైపు చూసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు. ‘‘అదృష్టం బాగుంది బ్రదర్.. బ్రతికిపోయారు’’.. అంటూ కొందరు, ‘‘వామ్మో! ఈ పాము వేషాలు మామూలుగా లేవుగా’’.. అని మరికొందరు, ‘‘విష సర్పాలకు దూరంగా ఉండడం మంచిది’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 6లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: రెస్టారెంట్‌లో స్ప్రింగ్ రోల్స్ తింటున్న ఓ వ్యక్తికి సడన్‌గా ఓ డౌట్.. లోపల ఏదో కదులుతోందని చూస్తే..

Updated Date - 2023-08-02T15:53:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising