ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: అదృష్టం అంటే ఈ కప్పదే.. దాదాపు మింగేస్తున్న సమయంలో పాము నుంచి ఎలా తప్పించుకుందంటే..

ABN, First Publish Date - 2023-08-15T15:41:43+05:30

సాధారణంగా ఎలుకలకు పిల్లులను నుంచి, పిల్లులకు కుక్కల నుంచి, కోతులకు చింపాజీల నుంచి ప్రాణ భయం ఉంటుంది. అలాగే కప్పలకు పాముల నుంచి ముప్పు పొచ్చి ఉంటుంది. ఒక్కసారి వాటి నోట పడ్డాయంటే.. ఇక తప్పించుకోవడం దాదాపు అసాధ్యం. అయితే అప్పుడప్పుడూ...

సాధారణంగా ఎలుకలకు పిల్లులను నుంచి, పిల్లులకు కుక్కల నుంచి, కోతులకు చింపాజీల నుంచి ప్రాణ భయం ఉంటుంది. అలాగే కప్పలకు పాముల నుంచి ముప్పు పొచ్చి ఉంటుంది. ఒక్కసారి వాటి నోట పడ్డాయంటే.. ఇక తప్పించుకోవడం దాదాపు అసాధ్యం. అయితే అప్పుడప్పుడూ కొన్ని మిరాకిల్స్ జరుగుతుంటాయి. కొన్నిసార్లు చావు అంచుల దాకా వెళ్లి.. క్షేమంగా బయటపడుతుంటాయి. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఈ తరహా ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ కప్పను పాము మింగేయాలని చూసింది. అయితే చివరి నిముషంలో దాన్ని నుంచి కప్ప క్షేమంగా బయటపడింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఓ పాత ఓ వీడియో (Viral video) ప్రస్తుతం తెగ హల్‌చల్ చేస్తోంది. ఓ కప్ప పార్కుల్లో హాయిగా విహరిస్తూ ఉంటుంది. ఇంతలో ఓ పాము దాని ఎదురుగా వస్తుంది. దీంతో.. ‘‘వామ్మో! చచ్చాన్రో దేవుడో’’.. అనుకుంటూ అక్కడే ఉన్న ఓ ఇనుప గేటును ఎక్కేస్తుంది. అయినా పాము కప్పను (Snake attack on frog) వదలకుండా వెంబడిస్తుంది. ఎలాగైనా మింగేయాలనే ఉద్దేశంతో కప్ప కాలిని గట్టిగా పట్టుకుంటుంది. మరోవైపు కప్ప కూడా తన ప్రాణాలను కాపాడుకొనేందుకు శతవిధాలా ప్రయత్నిస్తుంది.

Crime: అసలు వీడు మనిషేనా.. కాబోయే భార్య అన్న ఒకే ఒక్క మాటకు.. ఇంత పని చేస్తాడునుకోలేదు..

కప్ప కాలిని నోటితో పట్టుకున్న పాము.. ‘‘ఈ రోజు నిన్ను వదిలే ప్రసక్తే లేదు’’.. అన్నట్లుగా గట్టిగా లాగుతుంటే.., ‘‘నన్ను చంపడం నీ వల్ల కాదు’’.. అన్నట్లుగా కప్ప.. పాము నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇలా చాలా సేపటి తర్వాత.. ఎట్టకేలకు కప్ప పాము నుంచి తప్పించుకుని అక్కడి నుంచి పక్కకు పారిపోతుంది. దీంతో పాము కూడా కప్పను ఎలాగైనా తినాలనే ఉద్దేశంతో వెంటపడుతుంది. పాము నుంచి దూరంగా వెళ్లిపోయిన కప్ప.. ఇనుప గేటు నుంచి గోడ పైకి దూకి, అటు నుంచి పైకి పాకిపోతుంది. దీంతో చివరకు పాము నిరాశగా వెనుదిరగాల్సి వస్తుంది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

Viral Video: ఇతడి తెలివితేటలు అమోఘం.. కరెంట్ లేకుండానే పొలానికి నీళ్లు ఎలా వదులుతున్నాడో చూడండి..

Updated Date - 2023-08-15T15:41:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising