Dog's Marriage Video: పెంపుడు కుక్కలకు ఘనంగా పెళ్లి.. మేళతాళాలతో.. బంధువుల సమక్షంలో వివాహం.. అప్పగింతలప్పుడు ఏం చేశారంటే..
ABN, First Publish Date - 2023-03-09T21:18:42+05:30
సోషల్ మీడియా ప్రభావం పెరిగిపోతున్న ప్రస్తుతం తరుణంలో ఎక్కడ ఏ చిన్న వింతగానీ, విశేషం జరిగినా ఇట్టే చేతిలోని స్మార్ట్ ఫోన్లోకి వచ్చి వాలిపోతోంది. కొందరు కుటుంబ సభ్యులపై ఎంత ప్రేమ చూపిస్తారో.. పెంపుడు జంతువులపై కూడా అంతే ప్రేమను చూపిస్తుంటారు. ప్రధానంగా..
సోషల్ మీడియా ప్రభావం పెరిగిపోతున్న ప్రస్తుతం తరుణంలో ఎక్కడ ఏ చిన్న వింతగానీ, విశేషం జరిగినా ఇట్టే చేతిలోని స్మార్ట్ ఫోన్లోకి వచ్చి వాలిపోతోంది. కొందరు కుటుంబ సభ్యులపై ఎంత ప్రేమ చూపిస్తారో.. పెంపుడు జంతువులపై కూడా అంతే ప్రేమను చూపిస్తుంటారు. ప్రధానంగా పెంపుడు కుక్కల విషయంలో తీసుకునే జాగ్రత్తలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. వారికి సొంత పిల్లల్లా స్నానం చేయించడం దగ్గర నుంచి దుస్తులు వేయడం వరకూ ప్రతి విషయంలో ప్రత్యేకంగా చూసుకుంటుంటారు. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం కొందరు వారి పెంపెడు కుక్కలకు ఘనంగా వివాహం చేసిన వీడియో తెగ వైరల్ అవుతోంది. మేళతాళాలతో.. బంధువుల సమక్షంలో వివాహం చేశారు. చివరకు అప్పగింతలప్పుడు ఏం చేశారంటే..
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ (dogs Viral videos) అవుతోంది. కొందరు తమ పెంపుడు కుక్కలకు ఘనంగా వివాహం (marriage) చేశారు. చేయడం అంటే ఏదో ఆషామాషీగా కాకుండా మనుషుల వివాహాల తరహాలోనే అంగరంగ వైభంగా నిర్వహించారు. రెండు కుక్కలను వధూవరుల వేషధారణలో అందంగా ముస్తాబు చేశారు. అనంతరం వరుడి వేషధారణలో ఉన్న కుక్కను బొమ్మ కారులో (toy car) కూర్చోబెట్టి ఊరేగింపుగా తీసుకొచ్చారు. చివరకు రెండు కుక్కలకూ వివాహం జరిపించారు. కార్యక్రమానికి హాజరైన వారంతా అందంగా ముస్తాబై.. మనుషుల వివాహాలకు ఎలా వస్తారో అలాగే హాజరయ్యారు. వివాహానంతరం మేళతాళాలతో ఊరేగింపు కూడా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో చిన్న పిల్లలు (little children) ఉత్సాహంగా పాల్గొనడం చూడొచ్చు. ఊరేగింపు సందర్భంగా యువతులు డాన్సులు (young women Dance) కూడా వేస్తారు. వివాహంలో అందరికీ విందు భోజనాలు కూడా వడ్డించారు. చివరగా వధువు వేషంలో ఉన్న కుక్కను డోలిలో మోసుకుంటూ అత్తగారింటికి పంపించారు. ఇలా అప్పగింతల కార్యక్రమంలో వివాహ తంతును ముగించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. వావ్! వివాహం ఘనంగా చేశారు.. అని కొందరు, కుక్కల పెళ్లి పేరుతో ఇంత ఖర్చు చేయడం ఏం బాగాలేదు.. అని మరికొందరు.. ఆ ఖర్చుతో పేదలకు సాయం చేయొచ్చు కదా.. అని ఇంకొందరు కామెంట్లు పెడుతున్నారు.
Viral Video: అర్ధరాత్రి లారీల మధ్యలో.. యువతిని పట్టుకుని ఈ పోలీసు చేస్తున్న పని చూస్తే.. ఛీకొడతారు..
Updated Date - 2023-03-09T21:18:42+05:30 IST