Viral Video: వామ్మో! వీడేంటీ.. విషసర్పాలను ఇలా ఏరిపారేస్తున్నాడు.. నడి రోడ్డుపై ఇతడు చేసిన పని చూస్తే..

ABN, First Publish Date - 2023-03-17T16:49:03+05:30

ఇళ్ల పరిసరాలు, రోడ్లపై కొన్నిసార్లు ఉన్నట్టుండి విష సర్పాలు దర్శనమిస్తుంటాయి. అలాంటి సమయాల్లో ప్రాణం పోయినంత పనవుతుంటుంది. ఇక సడన్‌గా కాళ్ల ముందుకు వస్తే.. ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇళ్లల్లో..

Viral Video: వామ్మో! వీడేంటీ.. విషసర్పాలను ఇలా ఏరిపారేస్తున్నాడు.. నడి రోడ్డుపై ఇతడు చేసిన పని చూస్తే..
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ఇళ్ల పరిసరాలు, రోడ్లపై కొన్నిసార్లు ఉన్నట్టుండి విష సర్పాలు దర్శనమిస్తుంటాయి. అలాంటి సమయాల్లో ప్రాణం పోయినంత పనవుతుంటుంది. ఇక సడన్‌గా కాళ్ల ముందుకు వస్తే.. ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇళ్లల్లో ఊహించని ప్రదేశాల్లో పాములు దాక్కుని ఉండడం చూశాం, చివరకు షూలో నుంచి బుసలు కొడుతూ బయటికొచ్చిన పాములను కూడా చూశాం. ప్రస్తుతం ఇలాంటి వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఘాట్ రోడ్డుపై గుట్టలుగా ఉన్న విష సర్పాలను (Venomous snakes) ఒకే ఒక వ్యక్తి ఏరిపారేశాడు. అతడు చేసిన పని చూసి అంతా షాక్ అయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది..

సోషపల్ మీడియాలో పాములకు సంబంధించిన ఓ వీడియో (snakes Viral videos) వైరల్‌గా మారింది. ఉన్నట్టుండి చాలా పాములు.. ఘాట్ రోడ్డు పైకి దూసుకొస్తాయి. దీంతో వాహనదారులంతా ఎక్కడివారు అక్కడే ఆగిపోతారు. పాములను చూసి భయంతో వణికిపోతారు. ఎక్కడ కాటేస్తాయో.. అనే భయంతో వాటి వద్దకు వెళ్లేందుకు కూడా జంకుతారు. అయితే వారిలో ఓ వ్యక్తి ధైర్యంగా ముందుకు వస్తాడు. రావడమే కాకుండా రోడ్డు పైకి వస్తున్న పాములను ఒక్కొక్కటిగా పట్టుకుని చెత్తను ఏరినట్లు ఏరేస్తాడు.

కాసేపట్లో పెళ్లనగా ఫోన్‌కాల్.. వధువు చెప్పిన సమాధానం విని పెళ్లిని రద్దు చేసుకున్న వరుడు.. ఇంతకీ అసలేం జరిగిందంటే..!

వరుసగా అన్ని పాములను పట్టుకుని రోడ్డు పక్కన లోయలోకి విసిరేస్తాడు. ఇలా అటూ ఇటూ తిరుగుతూ చివరకు మొత్తం పాములన్నింటినీ తీసి పక్కన పడేస్తాడు. దీంతో వాహనదారులంతా హమ్మయ్య! అంటూ ఊపిరి పీల్చుకుంటారు. ఈ ఘటనను అక్కడే ఉన్న కొందరు వీడియో తీసి, సోషల్ మీడియాలో (Social media) షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. వామ్మో! ఇతడికి ఎంత ధైర్యం.. అంటూ కొందరు, జాగ్రత్త నాయనా.. ఇలాంటి పనులు ఎప్పుడూ చేయకు.. అంటూ మరికొందరు సలహాలు ఇస్తూ ఉన్నారు.

భర్త ప్రతీకారానికి భార్య సహకారం.. పొరిగింట్లో అతడు చేసిన పాడు పనిని సమర్థిస్తూ.. దగ్గరుండి వీడియో తీసి మరీ..

Updated Date - 2023-03-17T16:49:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising