Viral Video: బైకర్‌ను వెంబడిస్తున్న పోలీసులు.. గుడ్డిగా అతన్ని ఫాలో అవడంతో చివరకు ఏం జరిగిందంటే..
ABN, First Publish Date - 2023-02-12T20:08:34+05:30
బైకుల్లో పారిపోతున్న దొంగలు.. పోలీసులను తప్పుదారి పట్టిస్తూ ముప్పుతిప్పలు పట్టిస్తుంటారు. ఈ క్రమంలో వారిని వెంబడించే పోలీసులకు చుక్కలు కనపపడుతుంటాయి. అయితే హీరో పోలీస్ అయితే... చివరకు ఎలాగైనా దొంగను పట్టుకుని జైల్లో పెడతాడు. ఇలాంటి సీన్లు..
బైకుల్లో పారిపోతున్న దొంగలు.. పోలీసులను తప్పుదారి పట్టిస్తూ ముప్పుతిప్పలు పట్టిస్తుంటారు. ఈ క్రమంలో వారిని వెంబడించే పోలీసులకు చుక్కలు కనపపడుతుంటాయి. అయితే హీరో పోలీస్ అయితే... చివరకు ఎలాగైనా దొంగను పట్టుకుని జైల్లో పెడతాడు. ఇలాంటి సీన్లు సినిమాల్లో మాత్రమే కనపడుతుంటాయి. అయితే కొన్నిసార్లు నిజ జీవితంలోనూ ఈ తరహా ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ప్రస్తుతం పోలీసులు బైకర్‌ను వెంబడించే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బైకుపై వేగంగా వెళ్తున్న ఓ వ్యక్తిని.. పోలీసులు అంతే వేగంగా వెంబడిస్తూ ఉంటారు. అయితే అతన్ని గుడ్డిగా ఫాలో అవడంతో చివరకు ఏం జరిగిందంటే..
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ (Viral videos) అవుతోంది. ఓ బైకర్ పోలీసులకు చిక్కకుండా బైకుపై వేగంగా వెళ్తుంటాడు. పోలీసులు (police) అతన్ని కారులో అంతే వేగంగా వెంబడిస్తూ ఉంటారు. సినిమా షూటింగ్‌ని (Film shooting) తలపించే విధంగా ఉన్న ఈ సీన్‌లో చివరకు షాకింగ్ ఘటన చోటు చేసుకుంటుంది. ఎలాగైనా పోలీసుల నుంచి తప్పించుకోవాలని సదరు బైకర్ (Biker) విశ్వ ప్రయత్నాలు చేస్తుంటాడు. ఈ క్రమంలో అతడికి ఓ ఐడియా వస్తుంది. ఓ మలుపు పక్కనే కాలువ ఉంటుంది.
బావకు బదులుగా డ్యూటీకి వెళ్లిన బామర్ది.. అర్ధరాత్రి జరిగిన ఘటనతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ స్థానికులు..
అతి వేగంగా కాలువ వద్దకు వెళ్లిన బైకర్.. అంతే వేగంగా చాకచక్యంగా మలుపు తిప్పి రోడ్డు గుండా వెళ్లిపోతాడు. అయితే ముందు నుంచీ అతన్ని గుడ్డిగా ఫాలో అవుతూ వస్తున్న పోలీసులు ఎదురుగా కాలువ ఉందనే విషయాన్ని గమనించరు. దీంతో అతడి వెనుకే వెళ్లి నేరుగా కాలువలో (car fell into the canal) పడిపోతారు. ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో (CC cameras) రికార్డు అయింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: బలవంతం చేయగా బయటకు కక్కేసిన పాము.. చివరకు అది మింగిన వస్తువును చూసి అంతా షాక్...
Updated Date - 2023-02-12T20:18:45+05:30 IST