Shocking Video: ఓ పాత గోడలో నుంచి వింత శబ్దాలు.. ఏంటా అని అనుమానంతో ఒక్కో ఇటుకనూ తొలగిస్తూ వెళ్తే..!
ABN , First Publish Date - 2023-09-07T18:20:12+05:30 IST
గోడ పగలగొడుతుండగా కన్నంలోంచి ఓ పాము వేగంగా దూసుకురావడంతో నిర్మాణ కార్మికులను కంగారు పెట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఓ వ్యక్తి మాత్రం దాని తోకపట్టి అదుపులోకి తెచ్చాడు.

ఇంటర్నెట్ డెస్క్: అదో పాత ఇల్లు. అక్కడ కొందరు నిర్మాణ కార్మికులు గోడను పగలగొడుతున్నారు. ఇంతలో లోపలి నుంచి ఏదో శబ్దం. అక్కడున్న వారికి తొలుత ఏమీ అర్థం కాలేదు కానీ ఆలోచించే కొద్దీ ఒళ్లు గగుర్పొడిచింది. తమ అనుమానం నిజమవుతుందేమోననే భయం అందరిలో కనిపించింది. అయితే, ఓ వ్యక్తి ధైర్యం చేసి ఒక్కో ఇటుకా తొలగించడం ప్రారంభించాడు. ఇలా గోడలో కన్నం పెద్దది కాగానే లోపలికి తొంగి చూశాడు. ఇంకాస్త రిస్క్ చేసి కన్నంలో చేయి కూడా పెట్టాడు.
అలా కన్నం లోపలికి చేయి పెట్టాడో లేదో పాము బుసకొడుతూ బయటకు వచ్చేసింది. దాని శబ్దం వినగానే అప్రమత్తమైన వ్యక్తి చేయి వెనక్కు తీసేసుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే, పాము వేగంగా కన్నంలోకి బయటకు వచ్చి మరో వ్యక్తివైపు దూకడంతో అతడు భయపడిపోయి పక్కకు గెంతి తప్పించుకున్నాడు(Snake crawls out of wall). ఈ లోపు మొదటి వ్యక్తి మాత్రం వేగంగా స్పందించి పాము తోకపట్టి అదుపులోకి తెచ్చాడు. ఆ తరువాత ఏం జరిగిందనేది వీడియోలో కనిపించలేదు. అయితే, ఈ కొద్దిపాటి వీడియోనే(Viral video) నెటిజన్లలో కలకలం రేపింది.
పాము కాటేసి ఉంటే చాలా ప్రమాదం జరిగి ఉండేదని అనేక మంది అభిప్రాయపడ్డారు. పాము వేగంగా వ్యక్తిపైకి దూకడం తమను భయపెట్టిందని మరికొందరు కామెంట్ చేశారు. పాము తోకను ధైర్యంగా పట్టుకుని అదుపులోకి తెచ్చిన వ్యక్తిని చూసి మరికొందరు ఆశ్చర్యపోయారు. పాము చేతిలో ఉన్నా భయం లేకుండా అతడు నవ్వుతూ ఉండటం అనేక మందిని ఆశ్చర్యపరిచింది. ఇక గతంలో తాము ఎదుర్కొన్న ఇలాంటి అనుభవాల గురించి కొందరు చెప్పుకొచ్చారు. ఇటీవల నెట్టింట్లో ఇలాంటి వీడియోలు తెగ వైరల్ అవుతున్న విషయాన్ని కూడా ప్రస్తావించారు. సో.. కచ్చితంగా చూడాల్సిన వీడియో ఇది..మీరూ ఓ లుక్కేయండి!