Viral Video: బలవంతం చేయగా బయటకు కక్కేసిన పాము.. చివరకు అది మింగిన వస్తువును చూసి అంతా షాక్...

ABN, First Publish Date - 2023-02-12T17:52:32+05:30

పాములకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ఇళ్లల్లో ఊహించని ప్రదేశాల్లో బయటపడడం, ఆఖరికి పరుపు కింద, బూట్లలో దాక్కుని ఉన్న పాములను కూడా చూశాం. ప్రస్తుతం ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ పాముకు..

Viral Video: బలవంతం చేయగా బయటకు కక్కేసిన పాము.. చివరకు అది మింగిన వస్తువును చూసి అంతా షాక్...
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాములకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ఇళ్లల్లో ఊహించని ప్రదేశాల్లో బయటపడడం, ఆఖరికి పరుపు కింద, బూట్లలో దాక్కుని ఉన్న పాములను కూడా చూశాం. ప్రస్తుతం ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ పాముకు వింత సమస్య వచ్చి పడింది. దాన్ని పట్టుకున్న స్నేక్ క్యాచర్.. అతి కష్టం మీద బయటికి కక్కిస్తాడు. చివరకు పాము మింగిన వస్తువును చూసి అంతా షాక్ అయ్యారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ (Viral videos) అవుతోంది. ఓ స్నేక్ క్యాచర్ నాగు పామును పట్టుకుని (Cobra) ప్లాస్టిక్ డబ్బాలో వేసుకుని అటవీ ప్రాంతానికి తీసుకొస్తాడు. అయితే పాము ఏదో మింగడంతో ఇబ్బంది పడుతున్నట్లు అతడికి అనుమానం కలుగుతుంది. దీంతో డబ్బాలోంచి దాన్ని మెల్లగా బయటికి తీస్తే.. మధ్యలో ఉబ్బెత్తుగా ఉంటుంది. బయటికి వచ్చిన పాము.. వేగంగా కదలలేని పరిస్థితిలో ఉంటుంది. చివరకు అతి కష్టం మీద పాము కడుపులో ఉన్న వస్తువును బయటికి తీసేందుకు ప్రయత్నిస్తాడు. పాము కూడా దాన్ని బయటికి కక్కేందుకు ప్రయత్నిస్తుంటుంది.

గోనె సంచి మూటతో పగలంతా తిరిగిన వ్యక్తి.. చివరకు కాలువ పక్కన ఉండగా.. స్థానికులు వెళ్లి తెరచి చూడగా..

snake-videos.jpg

అయినా లోపలున్న వస్తువు అలాగే ఉంటుంది. దీంతో స్నేక్ క్యాచర్.. మధ్యలో చేత్తో పట్టుకుని కొంచెం కొంచెం బయటికి నెట్టే ప్రయత్నం చేస్తాడు. ఎట్టకేలకు పాము బలవంతంగా దాన్ని కక్కేస్తుంది. చివరకు ఓ ప్లాస్టిక్ పైపు (Plastic pipe) బయటికి రావడంతో అంతా షాక్ అవుతారు. సాధారణంగా కోడి పిల్లలో, లేదా ఎలుక పిల్లలనో మింగే పాము.. అందుకు విరుద్ధంగా ప్లాస్టిక్ పైపును మింగడాన్ని చూసి అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఇబ్బంది పడుతున్న పాముకు ఉపశమనం కలిగించిన స్నేక్ క్యాచర్‌ను అంతా అభినందిస్తున్నారు.

ప్రేమికుడి వద్దకు రాత్రి వేళ వెళ్లిన కూతురు.. ఆమెను కాపాడేందుకు వెళ్లిన తల్లి.. చివరకు అంతా చూస్తుండగా..

Updated Date - 2023-02-12T17:52:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising