ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: చెట్లు నడుస్తాయా..? ఇదేం ప్రశ్న అని అవాక్కవుతున్నారా..? దీన్ని చూస్తే మీకూ ఆ డౌట్ రావడం ఖాయం..!

ABN, First Publish Date - 2023-07-22T18:44:52+05:30

మనుషులు వదిలే కార్బన్ డయాక్సైడ్‌ను చెట్లు పీల్చుకుని.. మనకు ఆక్సిజన్ అందిస్తాయనే విషయం అందరికీ తెలిసిందే. ఇంత వరకూ ఓకే గానీ.. మన మాదిరే చెట్లు కూడా నడుస్తాయా..? అంటే.. ఇదేం ప్రశ్న అని అంటారు కదా. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. సోషల్ మీడియాలో చెట్టుకు సంబంధించిన వీడియో...

మనుషులు వదిలే కార్బన్ డయాక్సైడ్‌ను చెట్లు పీల్చుకుని.. మనకు ఆక్సిజన్ అందిస్తాయనే విషయం అందరికీ తెలిసిందే. ఇంత వరకూ ఓకే గానీ.. మన మాదిరే చెట్లు కూడా నడుస్తాయా..? అంటే.. ఇదేం పిచ్చి ప్రశ్న అని అంటారు కదా. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. సోషల్ మీడియాలో చెట్టుకు సంబంధించిన వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది. అడవిలో ఓ పెద్ద చెట్టు ఒక చోటి నుంచి మరో చోటికి నడుస్తుండడం చూసి అంతా షాక్ అవుతున్నారు. ఇదేంటీ చెట్లు కూడా నడుస్తాయా.. అంటూ చర్చించుకుంటున్నారు.

సోషల్ మీడియాలో ఒక చోటు నుంచి మరో చోటుకు కదులుతున్న చెట్టు వీడియో (Tree viral video) తెగ వైరల్ అవుతోంది. ఓ అడవిలో పొడవాటి చెట్లలో ఓ చెట్టు ఆశ్చర్యకరంగా ఓ చోటు నుంచి మరో చోటుకు కదులుతూ ఉంది. భూమిని చీల్చుకుని మరీ ఆ చెట్టు ముందుకు (moving tree) కదలడం వీడియోలో రికార్డ్ అయింది. అదే సమయంలో డ్రోన్ షాట్ తీయగా.. చెట్ట మధ్య నుంచి ఎవరో పరుగెత్తినట్లుగా ఓ చెట్టు అటూ, ఇటూ తిరగడం కనిపించింది. ఈ వీడియో చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. చెట్లు ఇలా కదలడం సహజమే అని నిపుణులు చెబుతున్నారు. సూర్య కాంతి కోసం చెట్టు ఓ చోటు నుంచి మరో చోటుకు కదులుతూ ఉంటుందట. రోజుకు రెండు లేదా మూడు సెంటీమీటర్లు చొప్పున కదులుతుందని తెలిసింది.

Auto Driver: ఆటో డ్రైవరే కానీ.. ఇంజనీర్లు కూడా అవాక్కయ్యేలా అద్భుతాన్నే చేసేశాడు.. పెట్రోలే అక్కర్లేని ఆటో రెడీ..!

ఈ ప్రక్రియకు కొన్ని సంవత్సరాల సమయం పడుతుందని చెబుతున్నారు. మంచు యుగం చివరి దశలో మంచు పలకలన్నీ తగ్గిపోవడంతో కెనడాలోని కొన్ని జాతుల చెట్లు వాయువ్య దిశలో సంవత్సరానికి ఒక మైలు లేదా అంతకంటే ఎక్కువ వేగంతో మరో చోటికి వెళ్లినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. సొక్రాటియా ఎక్సోర్హిజా (Socratia exorhiza trees) అనే కదిలే చెట్లు.. దక్షిణ అమెరికా, బొలీవియా, బ్రెజిల్, కొలంబియా, పెరూల్లో ఎక్కువగా కనిపిస్తాయి. ఈ చెట్టు ఆకులు సూర్యకాంతిలో పెరుగుతాయి. దట్టమైన అడవుల్లో సూర్యరశ్మి తక్కువగా పడుతుంది. దీంతో అవి వేర్ల సాయంతో సూర్య కాంతి పడే ప్రదేశానికి కదులుతుంటాయని తెలిసింది. కాగా, కదులుతున్న చెట్టు వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.

Bride: వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమాలో బ్రహ్మాజీలా పెళ్లి చేసుకునేందుకు సంబరంగా వధువు ఇంటికి వెళ్లాడు కానీ..!

Updated Date - 2023-07-22T18:44:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising