Viral Video: ఈ కుర్రాడి టాలెంట్‌ను మెచ్చుకోకుండా ఉండలేరు.. ఫొటోలకు ఫోజులు ఎలా ఇవ్వాలో కూడా ఆ భార్యాభర్తలకు చూపించి మరీ..
ABN, First Publish Date - 2023-04-08T20:41:28+05:30
ఒకప్పటితో పోలిస్తే ప్రస్తుతం వయసుతో నిమిత్తం లేకుండా చాలా మంది ఫొటోలు, వీడియోలు తీసుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. కొందరైతే సినిమాటిక్ ఫొటోలు, వీడియోలు తీసుకుంటూ.. లైకులు, వ్యూస్ కోసం వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. ఈ క్రమంలో..
ఒకప్పటితో పోలిస్తే ప్రస్తుతం వయసుతో నిమిత్తం లేకుండా చాలా మంది ఫొటోలు, వీడియోలు తీసుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. కొందరైతే సినిమాటిక్ ఫొటోలు, వీడియోలు తీసుకుంటూ.. లైకులు, వ్యూస్ కోసం వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. ఈ క్రమంలో ఫొటో, వీడియోగ్రాఫర్లకూ మంచి డిమాండ్ ఏర్పడింది. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. ప్రస్తుతం ఓ జంటకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఫొటోలకు ఫోజులు ఎలా ఇవ్వాలో.. భార్యాభర్తలకు ఓ కుర్రాడు చెప్పిన విధానం చూసి అంతా మెచ్చుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే..
ఇండోనేషియాలోని బాలి ద్వీపానికి (Indonesian island of Bali) పర్యాటకులు పోటెత్తుతుంటారు. ఈ ద్వీపానికి ఏడాదికి లక్షల్లో పర్యాటకులు వస్తుంటారు. ఇక్కడి బీచ్‌లు, సూర్యోదయ, సూర్యాస్తమయ వేళల్లో కనిపించే దృశ్యాలు టూరిస్టులను కట్టిపడేస్తుంటారు. అందుకే ఎక్కడెక్కడి నుంచో పర్యాటకులు ఇక్కడి దీవులను సందర్శించడానికి ఆసక్తి కనబరుస్తుంటారు. అలాగే ఇక్కడి అందమైన దృశ్యాలను తమ కెమెరాల్లో బంధించేందుకు పోటీపడుతుంటారు. కనువిందు చేసే జలపాతాల (Waterfalls) వద్ద అంతే అందంగా ఫోజులు ఇస్తూ ఫొటోలు దిగుతుంటారు. స్థానికంగా ఉండే చాలా మంది గైడ్‌లు (Guide) దగ్గరుండి మరీ ప్రేమికులు, దంపతులకు వివిధ రకాలుగా ఫోజులు పెట్టించి మరీ ఫొటోలు, వీడియోలు తీస్తుంటారు.
కాగా, ప్రస్తుతం బాలి ద్వీపంలో ఓ జంటకు స్థానికంగా ఉండే యువకుడు ఫోజులు నేర్పించి మరీ తీసిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో (Viral photos and videos) వైరల్ అవుతున్నాయి. ఈ కుర్రాడు ఫొన్ పట్టుకుని ఎదురుగా జలపాతం వద్ద ఉన్న దంపతులకు ఫొటోలు తీసేందుకు సిద్ధమవుతాడు. అయితే వారికి సరైన ఫోజులు ఇవ్వడం చేతకాకపోవడంతో దగ్గరుండి మరీ నేర్పిస్తాడు. భార్యను పైకి ఎత్తుకోమని సైగ చేస్తాడు. ఫొటో అందంగా రావడం కోసం మహిళకు కూడా వివిధ సలహా ఇస్తాడు. ఇలా చాలా ఫోజులను తాను నిలబడి చూపించి మరీ ఫొటోలు తీస్తాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ గైడ్ చాలా ఓపిగ్గా తన బాధ్యతలను నిర్వర్తిస్తున్నాడు’’.. అని కొందరు, ‘‘ఇతడి టాలెంట్ సింప్లీ సూపర్’’.. అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.
Updated Date - 2023-04-08T20:41:28+05:30 IST