Viral Video: బారీకేడ్స్‌ను పడేసి.. కార్లపైకి ఎక్కి పడుకుని మరీ నడిరోడ్డుపై ఓ యువతి రచ్చ రచ్చ.. ప్రేమలో మోసపోయానంటూ..
ABN, First Publish Date - 2023-03-28T16:04:36+05:30
ప్రేమ వ్యవహారాల్లో కొన్నిసార్లు యువకులు చేసే పనులు మరీ విచిత్రంగా ఉంటాయి. ఇక లవ్ ఫెయిల్యూర్ ఘటనల్లో చాలా మంది యువతుల పట్ల దారుణాలకు పాల్పడడమో.. లేదా ఆ కోపాన్నంతా వేరే వారిపై చూపించడమో చేస్తుంటారు. అయితే కొన్నిసార్లు యువుతులు కూడా..
ప్రేమ వ్యవహారాల్లో కొన్నిసార్లు యువకులు చేసే పనులు మరీ విచిత్రంగా ఉంటాయి. ఇక లవ్ ఫెయిల్యూర్ ఘటనల్లో చాలా మంది యువతుల పట్ల దారుణాలకు పాల్పడడమో.. లేదా ఆ కోపాన్నంతా వేరే వారిపై చూపించడమో చేస్తుంటారు. అయితే కొన్నిసార్లు యువుతులు కూడా.. ఇలాంటి విషయాల్లో తామేమీ తక్కువ కాదంటూ నిరూపిస్తుంటారు. ఇలాంటి ఓ యువతికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రేమలో మోసోయానంటూ నడి రోడ్డుపై కార్ల పైకి ఎక్కి మరీ ఓ యువతి హల్‌చల్ చేసింది..
మధ్యప్రదేశ్ (Madhya Pradesh) గ్వాలియర్‌లోని ఫూల్ బాగ్ కూడలి వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. 25 ఏళ్ల ఓ యువతి (young woman) ఉన్నట్టుండి రోడ్డుపై హల్‌చల్ చేసింది. తాను ప్రేమలో (love) మోసపోయానంటూ గట్టిగా అరుస్తూ బీభత్సం సృష్టించింది. వాహనాల (vehicles) మధ్యలో అటూ ఇటూ తిరుగుతూ రచ్చ రచ్చ చేసింది. అంతటితో ఆగకుండా వాహనదారుల పట్ల దురుసుగా ప్రవర్తించింది. ఓ స్కూటీకి (Scooty) అడ్డుపడి, యజమానిని కిందకు దింపింది. తర్వాత తాను స్కూటీపై కూర్చుని నడిపేందుకు ప్రయత్నించింది. తర్వాత అక్కడే ఉన్న బారికేడ్లను కింద పడేయడంతో వాహనదారులంతా అవాక్కయ్యారు.
అప్పటికీ ఆగని సదరు యువతి.. నేరుగా కారు పైకి ఎక్కి కూర్చుంది. కారు యజమాని దిగమంటూ ఎంత బ్రతిమాలుతున్నా వినిపించుకోకుండా కారుపై నిలబడి కేకలు వేస్తూ చిత్రవిచిత్రంగా ప్రవర్తించడం అందరినీ షాక్‌కు గురి చేసింది. తర్వాత కొంతమంది మహిళలు అక్కడికి చేరుకుని, యువతిని కిందకు దించే ప్రయత్నం చేశారు. అయినా ఆమె వారిని కూడా పక్కకు నెట్టేసి, కారు యజమానితో వాగ్వాదానికి దిగింది. చివరకు పోలీసులు (police) అక్కడికి చేరుకోవడంతో సమస్య సర్దుమణిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో (Social media) తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు పెడుతున్నారు.
Funny Video: ఏమీ చదవకుండానే ఐఏఎస్ అవడం ఎలా..?.. ఈ ప్రశ్నకు ఈ యువతి ఇచ్చిన సమాధానమేంటో వింటే..
Updated Date - 2023-03-28T16:04:36+05:30 IST