Chennai Grandma: ఒకప్పుడు ఇంగ్లీషు టీచర్.. ఇప్పుడు రోడ్డు పక్కన అనాథలా.. ఆమెను ఓ కుర్రాడు గుర్తు పట్టి..!
ABN, First Publish Date - 2023-09-14T20:49:22+05:30
బండ్లు ఓడలు.. ఓడలు బండ్లు అవుతాయనే చందంగా కొందరి జీవితాలు ఉన్నట్టుండి అందనంత ఎత్తుకు చేరుకుంటుంటే.. మరికొందరు జీవితాలను అనూహ్యంగా అధఃపాతాళానికి నెట్టివేయబడుతుంటాయి. ప్రస్తుతం సోషల్ మీడియా విపరీతమైన ప్రభావం చూపిస్తుండడంతో ఇలాంటి..
బండ్లు ఓడలు.. ఓడలు బండ్లు అవుతాయనే చందంగా కొందరి జీవితాలు ఉన్నట్టుండి అందనంత ఎత్తుకు చేరుకుంటుంటే.. మరికొందరు జీవితాలను అనూహ్యంగా అధఃపాతాళానికి నెట్టివేయబడుతుంటాయి. ప్రస్తుతం సోషల్ మీడియా విపరీతమైన ప్రభావం చూపిస్తుండడంతో ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ వృద్ధురాలికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఒకప్పుడు ఇంగ్లీష్ టీచర్ అయిన ఆమె.. ప్రస్తుతం రోడ్డు పక్కన అనాథలా మారిపోయింది. ఓ కుర్రాడు గుర్తుపట్టి వీడియో తీయడంతో వెలుగులోకి వచ్చింది. నాలుగు రోజుల్లోనే 5లక్షల ఫాలోవర్లను సొంతం చేసుకున్న ఈ బామ్మకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
చెన్నై (Chennai) వీధుల్లో భిక్షాటన చేస్తున్న 81 ఏళ్ల మార్లిన్ అనే వృద్ధురాలి (old woman) గురించి తెలుసుకుని అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయ్యో! ఈ బామ్మకు ఎంతటి దీన పరిస్థితి వచ్చిదంటూ సానుభూతి చూపిస్తున్నారు. ఈమెకు సంబంధించిన వివరాల్లోకి వెళితే... బర్మాలోని (Burma) రంగూన్ ప్రాంతంలో ఈ వృద్ధురాలు పుట్టి పెరిగింది. అక్కడ మార్లిన్.. పిల్లలకు ఇంగ్లీష్, గణిత సబ్టెక్టులు బోధిస్తూ ఉండేది. అయితే ఆ సయమంలో ఓ భారతీయుడితో ఆమెకు పరిచయమైంది. ఆ పరిచయం కాస్త కొన్నాళ్లకు ప్రేమగా మారింది. తర్వాత ఇద్దరూ వివాహం (marriage) చేసుకున్నారు. అయితే వివాహానంతరం ఆమె తన భర్తతో కలిసి ఇండియాలోనే స్థిరపడిపోయింది.
ఇలావుండగా, వివాహమైన కొన్నేళ్ల తర్వాత మార్లిన్ భర్త, కుటుంబ సభ్యులు మొత్తం మరణించారు. భర్తకు సంబంధించిన వాళ్లు ఎవరూ లేకపోవడంతో మార్లిన్ ఒంటరిగా మిగిలిపోయింది. ఈ క్రమంలో కొన్ని నెలల క్రితం ఆమె చెన్నైలోని అడయార్ చేరుకున్నారు. వయసు మీదపడడంతో తప్పనిసరి పరిస్థితుల్లో భిక్షాటన చేస్తూ జీవిస్తోంది. ఇటీవల ఓ యువకుడు మార్లిన్ గురించి తెలుసుకుని వీడియో తీశాడు. ఆమెతో మాట్లాడటమే కాకుండా గత చరిత్రను కూడా వివరిస్తూ వీడియో తీశాడు. అలాగే వృద్ధురాలు ఇకపై భిక్షాటన చేయకుండా ఇంగ్లీష్ పాఠాలు బోధించేలా.. ‘‘ఇంగ్లీష్ విత్ మార్లిన్’’ పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పేజీ కూడా క్రియేట్ చేశాడు. ఈ పేజీకి నాలుగ రోజుల్లోనే సుమారు ఐదు లక్షల మంది ఫాలోవర్లు వచ్చారు. ప్రస్తుతం మార్లిన్‌ను సమీపంలోని ఓ వృద్ధాశ్రమంలో చేర్పించారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం నాలుగు లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.
Updated Date - 2023-09-14T20:49:22+05:30 IST