కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: డేగ కాలి గోర్లకు ఎంత పవర్ ఉంటుందో ఎప్పుడైనా చూశారా.. అంత పెద్ద జింకను ఎంత ఈజీగా ఎత్తుకెళ్లిందో చూస్తే..

ABN, First Publish Date - 2023-09-17T20:28:22+05:30

పులి పంజా దెబ్బ చూశాం, ఏనుగు తొండానికి ఉన్న బలం చూశాం.. అలాగే జింక కాళ్లు, కంగారు తోకలో ఉన్న పవర్ ఏంటో కూడా చూశాం. ఆహార వేటలో వాటి వాటి బలమేంటో అప్పుడప్పుడూ బయటపడుతుంటుంది. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా...

Viral Video: డేగ కాలి గోర్లకు ఎంత పవర్ ఉంటుందో ఎప్పుడైనా చూశారా.. అంత పెద్ద జింకను ఎంత ఈజీగా ఎత్తుకెళ్లిందో చూస్తే..

పులి పంజా దెబ్బ చూశాం, ఏనుగు తొండానికి ఉన్న బలం చూశాం.. అలాగే జింక కాళ్లు, కంగారు తోకలో ఉన్న పవర్ ఏంటో కూడా చూశాం. ఆహార వేటలో వాటి వాటి బలమేంటో అప్పుడప్పుడూ బయటపడుతుంటుంది. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, డేగ వేటకు సంబంధించిన వీడియో సోషల్ మీడియలో తెగ వైరల్ అవుతోంది. అంత పెద్ద జింకను ఓ డేగ ఈజీగా ఎత్తుకెళ్లడం చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ‘‘వామ్మో! ఈ డేగ పవర్ మామూలుగా లేదుగా’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో (Viral Video) ఓ వీడియో వైరల్ అవుతోంది. ఓ జింక కొండ (hill) పైన అలసిపోయి పడుకుని ఉంటుంది. ఆ సమయంలో ఆకాశంలో విహరిస్తున్న ఓ డేగ దృష్టి (eagle targeting deer) జింకపై పడుతుంది. ‘‘ఈ రోజు నా పంట పండింది.. కొడితే దీన్నే కొట్టాలి’’.. అని అనుకుందో ఏమో గానీ వాయు వేగంతో కిందకు దూసుకొచ్చింది. ఇలా దూసుకొచ్చి పడుకుని ఉన్న జింకను (eagle carrying a deer) కాళ్లను పట్టుకుని అంతే వేగంతో గాల్లోకి లేచింది. అంత పెద్ద జింకను కాస్తా.. కోడి పిల్ల తరహాలో ఎత్తుకెళ్లడం చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది.

Viral Video: తెలిసి చేసిందా... తెలీక చేసిందా... బైకుపై కూర్చున్న ఈ మహిళను చూసి నవ్వుకుంటున్న నెటిజనం..

కొండ పైనుంచి జింకను ఎత్తుకెళ్లిన డేగ ఎక్కడా కింద వేయకుండా... తన స్థావరానికి తీసుకెళ్తుంది. ఈ ఘటనను కొందరు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు. ‘‘అరే! ఇదెలా సాధ్యం... మరీ విచిత్రంగా ఉందే’’.. అని కొందరు, ‘‘డేగ పవర్ ఏంటో ఈ వీడియోలో చూస్తే తెలుస్తోంది’’.. అని మరికొందరు, ‘‘ఈ డేగను చూస్తే సింహాలు కూడా భయపడతాయేమో’’.. అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 22వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: తలలో లక్షలాది పేలతో హెయిర్ కేర్ సెంటర్‍కి వెళ్లిన యువతి.. వారు చేసిన చిన్న చిట్కాతో చివరికి ఏమైందో చూడండి..

Updated Date - 2023-09-17T20:28:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising