ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: కొన్ని నెలలుగా మంచంపై పడుకోవడానికే భయపడుతున్న ఆర్మీ అధికారి.. చివరకు కేర్ టేకర్ వెళ్లి పరుపు కింద పరిశీలించగా..

ABN, First Publish Date - 2023-07-28T20:59:25+05:30

ఇళ్లల్లో ఊహించని ప్రదేశాల్లో అనూహ్యంగా వింత సంఘటనలు చోటు చేసుకోవడం తరచూ చూస్తూ ఉంటాం. మంచాలు, ఫ్రిడ్జ్‌లలో విష సర్పాలు బయటపడడడం చాలా సార్లు చూశాం. అయితే తాజాగా... ఓ రిటైర్డ్ ఆర్మీ అధికారికి వింత సమస్య వచ్చి పడింది..

ఇళ్లల్లో ఊహించని ప్రదేశాల్లో అనూహ్యంగా వింత సంఘటనలు చోటు చేసుకోవడం తరచూ చూస్తూ ఉంటాం. మంచాలు, ఫ్రిడ్జ్‌లలో విష సర్పాలు బయటపడడడం చాలా సార్లు చూశాం. అయితే తాజాగా, ఓ రిటైర్డ్ ఆర్మీ అధికారికి వింత సమస్య వచ్చి పడింది. కొన్నేళ్ల క్రితం చూపు కోల్పోయిన అతను ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాడు. అయితే కొన్ని నెలలుగా అతను మంచంపై పడుకోవడానికే భయపడుతున్నాడు. ఏదో కుడుతున్నట్లు అనుమానం రావడంతో టేర్ టేకర్‌కు సమాచారం అందించాడు. అతను వెళ్లి చూడగా పరుపు కింద షాకింగ్ దృశ్యం కనిపించింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

అమెరికాలోని (America) అర్కాన్సాస్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన ఓ రిటైర్డ్ ఆర్మీ అధికారికి (Retired Army Officer) విచిత్ర అనుభవం ఎదురైంది. ఇతడు కొన్నేళ్ల క్రితం చూపు కోల్పోయాడు. ప్రస్తుతం ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాడు. చూపు లేకపోయినా ఇంట్లో ప్రతి అంగుళం తనకు తెలుసు కాబట్టి ఎలాంటి సమస్యా లేదు. అయితే ఇటీవల ఈయనకు ఊహించని సమస్య వచ్చి పడింది. కొన్ని నెలలుగా ఇతడు పరుపుపై పడుకోవడానికి భయపడుతున్నాడు. రాత్రయిందంటే చాలు.. ఒళ్లంతా ఏదో కుడుతున్నట్లుగా ఉండడంతో అనుమానం వచ్చింది. రోజు రోజుకూ సమస్య పెరుగుతుండడంతో చివరకు తనకు తెలిసిన కేర్ టేకర్‌కు విషయం తెలియజేశాడు.

Viral Video: ఈ శునకానికి మస్తు టాలెంట్ ఉందిగా.. గేదెపైకి ఎక్కి నిల్చుని ఎలా వస్తోందో మీరే చూడండి..!

అతను వెళ్లి పరుపుపై దుప్పటి తీసేయగానే షాకింగ్ దృశ్యం కనిపించింది. కుప్పలు కుప్పలుగా నల్లులు (Bed bugs) బయటడపడడం చూసి షాక్ అయ్యాడు. నెలల తరబడి పరుపును శుభ్రం చేయకపోవడం వల్లే ఇలా జరిగిందని గుర్తించారు. ఇంతవరకు ఇంత భారీ స్థాయిలో నల్లులను తాము చూడలేదని పెస్ట్ కంట్రోల్ టీం తెలిపింది. ఎట్టకేలకు ఆర్మీ అధికారి ఇంట్లో చెదలు నివారణ చర్యలు చేపట్టిన అనంతరం.. వృద్ధుడికి కొత్త మంచాన్ని బహుమతిగా ఇచ్చారు. కాగా, నల్లులకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 72వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

WhatsApp: వాట్సప్‌ యూజర్లకు గుడ్‌న్యూస్.. మరో అదిరిపోయే ఫీచర్ వచ్చేసిందిగా..!

Updated Date - 2023-07-28T21:02:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising