ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: సైకిల్‌ నడుపుతున్నారా.. దారి మధ్యలో ఇలాంటి ప్రమాదం కూడా పొంచి ఉండొచ్చు.. ఇతడి విషయంలో ఏమైందంటే..

ABN, First Publish Date - 2023-05-11T15:43:43+05:30

కొన్నిసార్లు రోడ్డు ప్రమాదాలు జరిగే తీరు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. వాహనదారుల నిర్లక్ష్యం వల్ల ఎక్కువగా ప్రమాదాలు జరుగుతుంటాయి. అయితే అప్పుడప్పుడూ రోడ్డుపై ఏర్పడ్డ గుంతల కారణంగానో, పేరుకుపోయిన మట్టి కారణంగా కూడా ఊహించని ప్రమాదాలు జరుగుతుంటాయి. చాలా మంది..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొన్నిసార్లు రోడ్డు ప్రమాదాలు జరిగే తీరు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. వాహనదారుల నిర్లక్ష్యం వల్ల ఎక్కువగా ప్రమాదాలు జరుగుతుంటాయి. అయితే అప్పుడప్పుడూ రోడ్డుపై ఏర్పడ్డ గుంతల కారణంగానో, పేరుకుపోయిన మట్టి కారణంగా కూడా ఊహించని ప్రమాదాలు జరుగుతుంటాయి. చాలా మంది సైకిల్‌పై వెళ్తే ఏ సమస్యా ఉండదని అనుకుంటారు. కానీ ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో చూస్తే ఖచ్చితంగా అవాక్కవుతారు. వాహనాలు, గుంతలు వంటివి ఏవీ లేకున్నా ఓ సైక్లిస్ట్ ప్రమాదానికి గురయ్యాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ (Viral videos) అవుతోంది. ముంబైకి (Mumbai) చెందిన ఓ వ్యక్తి మే 10న.. మలబార్ హిల్ నుంచి కెంప్స్ కార్నర్‌కు వెళ్తుండగా ఊహించని ఘటన చోటు చేసుకుంది. రోడ్డు ఫ్రీగా ఉండడంతో సదరు వ్యక్తి సైకిల్‌పై (Cycle) రయ్యిన దూసుకెళ్లాడు. అయితే కొద్ది దూరం వెళ్లగానే రోడ్డు మధ్యలో ఉన్న ఇనుప గ్రిల్ (Iron grill) సందులో టైరు ఇరుక్కుంది. ఇనుప గ్రిల్ మధ్యలో సరిగ్గా సైకిల్ టైరు పట్టేంత గ్యాప్ ఉండడంతో ముందు టైరు అందులో ఇరుక్కుంది. దీంతో అప్పటికే వేగంగా వెళ్తున్న వ్యక్తి.. ఒక్కసారిగా ధబేల్‌మని కిందపడ్డాడు.

Viral Video: పట్టు వదలకుండా ప్రయత్నిస్తే.. అసాధ్యం అంటూ ఏదీ ఉండదు.. కావాలంటే ఈ కుక్కను చూడండి..

ఈ ప్రమాదంలో అతడి మొఖంపై (injuries on the face) గాయాలయ్యాయి. అదృష్టవశాత్తు ఆ సమయంలో వాహనాలు రాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. చుట్ట పక్కల వారు అతన్ని రక్షించి, చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ‘‘వాహనం ఏదైనా, ప్రాంతం ఏదైనా.. ప్రయాణ సమయంలో అప్రమత్తంగా ఉండాలి’’.. అంటూ కొందరు, ‘‘సైకిల్ అయినా సరే అంత వేగం పనికిరాదు’’.. అని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.

Viral Video: అరటి పండ్ల లోడుతో వచ్చిన బాలుడు.. ఒక్కసారిగా చుట్టుముట్టిన జనం.. అంతా చూస్తుండగానే..

Updated Date - 2023-05-11T15:43:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising