ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: వీరు ఇక్కడే ఇలా వుంటే.. ఇక ఇంట్లో ఎలా వుంటారో.. మెట్రో రైల్లో మహిళల నిర్వాకంపై ముక్కున వేలేసుకుంటున్న నెటిజన్లు..

ABN, First Publish Date - 2023-06-06T17:14:49+05:30

మహిళల గొడవలు చూస్తే కొన్నిసార్లు నవ్వు వస్తుంటుంది. పక్క పక్క ఇళ్లల్లో ఉండే మహిళలు.. నిత్యం గొడవలు పడడం చూస్తూనే ఉంటాం. అలాగే వీధి కొళాయిల వద్ద బిందెలతో కొట్టుకునే మహిళలనూ చాలా మందిని చూశాం. ఇలాంటి గొడవలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహిళల గొడవలు చూస్తే కొన్నిసార్లు నవ్వు వస్తుంటుంది. పక్క పక్క ఇళ్లల్లో ఉండే మహిళలు.. నిత్యం గొడవలు పడడం చూస్తూనే ఉంటాం. అలాగే వీధి కొళాయిల వద్ద బిందెలతో కొట్టుకునే మహిళలనూ చాలా మందిని చూశాం. ఇలాంటి గొడవలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఇద్దరు మహిళల గొడవకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. మెట్రో రైల్లో ఇద్దరు మహిళలు చెప్పులు, వాటర్ బాటిళ్లతో గొడవ పడడం చూసి అంతా అవాక్కవుతున్నారు. వీరు ఇక్కడే ఇలా ఉంటే.. ఇక ఇంట్లో ఎలా వుంటారో అంటూ కామెంట్లు పెడుతున్నారు.

సోషల్ మీడియాలో ఢిల్లీ మెట్రో రైలుకు (Delhi Metro Rail) సంబంధించిన వీడియో తెగ వైరల్ (Viral video) అవుతోంది. యువతులు, మహిళలతో రద్దీగా ఉన్న మెట్రో రైల్లో ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంటుంది. ఇద్దరు మహిళల మధ్య సడన్‌గా (quarrel between women గొడవ మొదలవుతుంది. ఓ మహిళ తన షూ తీసుకుని దాడికి దిగగా.. మరో మహిళ తన వద్ద ఉన్న వాటర్ బాటిల్‌తో ఎదురుదాడికి యత్నిస్తుంది. ఇద్దరూ ఎదురెదుగా నిల్చుని ఢీ అంటే ఢీ అన్నట్లుగా పోటీకి సిద్ధమవుతారు. దీంతో పక్కన ఉన్న మహిళలంతా షాక్ అవుతారు.

Viral News: ఈ మందుబాబు అతి ప్రేమను చూసి.. తలలు పట్టుకున్న ప్రయాణికులు.. ఇంతకీ బస్సు వద్ద ఇతడు చేసిన పని ఏంటంటే..

కొందరు కలుగజేసుకుని వారిని పక్కకు లాగేందుకు ప్రయత్నిస్తారు. అయినా వారు మాత్రం తగ్గేదే లే.. అన్నట్లుగా గొడవకు సిద్ధపడుతుంటారు. కొద్ది సేపటి తర్వాత ఓ మహిళ కోపంతో.. బాటిల్ లోని నీళ్లను ఎదుటి మహిళపై చల్లుతుంది. దీంతో పక్కన కూర్చున వారు.. మనకు ఎందుకొచ్చిన గొడవ.. అన్నట్లుగా అక్కడి నుంచి లేచి వెళ్లిపోతారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. ‘‘రాజీవ్‌చౌక్ స్టేషన్‌ పేరుని కురుక్షేత్ర స్టేషన్‌గా మార్చాలి’’.. అని కొందరు, ‘‘వీళ్ల భర్తల పరిస్థితి తలుకుంటే బాధేస్తోంది’’.. అని మరికొందరు, ఫన్నీ ఎమోజీలు పెడుతూ కామెంట్లు చేస్తున్నారు.

Viral News: తీరా దండ వేసే సమయంలో వరుడిని చూసి బోరున విలపించిన వధువు.. బంధువులంతా చెబుతున్నా వినిపించుకోకుండా.. చివరకు ఏం చేసిందంటే..

Updated Date - 2023-06-06T17:20:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising