Viral Video: బస్సును నెట్టినట్టుగా రైలును కూడా నెట్టేస్తున్నారు.. పూర్తి వీడియో చూసేయండి..!
ABN, First Publish Date - 2023-07-10T17:10:04+05:30
మన దేశంలో రైల్వే వ్యవస్థ ఎంతగానే అభివృద్ధి చెందింది. పెద్ద పెద్ద నగరాల నుంచి అనేక చిన్న చిన్న ప్రాంతాలకు రైళ్లు వెళుతున్నాయి. అలాగే ఎంతటి దూరాన్ని అయినా సరే వీలైనంత త్వరగా చేరుకునేలా వందే భారత్ వంటి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లు కూడా వచ్చాయి. అయితే రైల్వే వ్యవస్థ ఎంతగా అభివృద్ధి చెందినప్పటికీ అందులోని కొన్ని సమస్యలు మాత్రం అలాగే ఉండిపోయాయి.
మన దేశంలో రైల్వే వ్యవస్థ ఎంతగానే అభివృద్ధి చెందింది. పెద్ద పెద్ద నగరాల నుంచి అనేక చిన్న చిన్న ప్రాంతాలకు రైళ్లు వెళుతున్నాయి. అలాగే ఎంతటి దూరాన్ని అయినా సరే వీలైనంత త్వరగా చేరుకునేలా వందే భారత్ వంటి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లు కూడా వచ్చాయి. అయితే రైల్వే వ్యవస్థ ఎంతగా అభివృద్ధి చెందినప్పటికీ అందులోని కొన్ని సమస్యలు మాత్రం అలాగే ఉండిపోయాయి. ఈ మధ్య కాలంలో రైల్వేలో ఉన్న సమస్యలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. రైళ్ల ప్రమాదాలు, రైళ్లు సమయానికి రాకపోవడం, రైళ్ల లోపల ఉండే అపరిశుభ్రత, రైళ్లో ఇచ్చే ఆహార పదార్థాల్లో నాణ్యత లేకపోవడం వంటివి. అయితే వీటన్నింటినీ కాస్త పక్కనపెడితే అప్పుడప్పుడు రైళ్లు పట్టాల మీద ఆగిపోతుండడం గమనార్హం. దీంతో ఆగిపోయిన రైళ్లను రైల్వే సిబ్బంది, పోలీసులు, రైల్వే జవాన్లు నెడుతున్న ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. వాటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. తాజాగా అలాంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సాధారణంగా బస్సులు స్టార్టింగ్ ట్రబుల్ సమస్యలతో స్టార్ట్ కావు. అప్పుడు బస్సు సిబ్బందితోపాటు ప్రయణికులు బస్సును నెడుతుంటారు. ఆ తర్వాత అవి స్టార్ట్ అవుతాయి. కానీ అలాంటి ఘటనలే ప్రస్తుతం రైళ్ల విషయంలోనూ చోటు చేసుకుంటుడడం గమనార్హం.
31 సెకన్లపాటు ఉన్న ఆ వీడియోలో పట్టాలపై ఆగిన ఓ రైలును రైల్వే సిబ్బంది, అధికారులు, పోలీసులు, రైల్వే జవాన్లు, ప్రయాణికులు నెడుతున్నారు. వీడియోలో కనిపించిన వివరాల ప్రకారం.. ఒక రైలు సాంకేతిక సమస్యలతో పట్టాలపై ఆగిపోయింది. దీంతో ఆ రైలును రైల్వే సిబ్బంది, రైల్వే పోలీసులు, రైల్వే అధికారులు, రైల్వే జవాన్లతోపాటు ప్రయాణికులు కూడా నెడుతున్నారు. ఒకరకంగా చెప్పాలంటే రైలును అచ్చం బస్సును నెట్టినట్లుగానే నెట్టారు. మొదట అందరూ కలిసి ఒక వైపునకు నెడితే రైలు కదలలేదు. ఆ తర్వాత అందరూ కలిసి మరొక వైపునకు నెట్టారు. అప్పుడు రైలు కదిలింది. దీంతో రైలును నెట్టినవారంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఘటన ఎక్కడ జరిగిందనే వివరాలు తెలియలేదు. కాకపోతే దక్షిణ మధ్య రైల్వే మార్గంలో జరిగిందని సమాచారం. అయితే ఈ వీడియోను ట్విట్టర్‌లో అప్‌లోడ్ చేసిన వ్యక్తి భారతీయ రైల్వేలను ఆధునీకరించేందుకు తమ ప్రభుత్వం రికార్డు స్థాయిలో పెట్టుబడులు పెడుతోందని, రాబోయే 8 సంవత్సరాల్లో రైల్వేల ఆధునీకరణలో కొత్త ప్రయాణాలను చూస్తామని ప్రధాని నరేంద్ర మోదీ అన్న వ్యాఖ్యలను రాసుకొచ్చాడు. ఇక సోషల్ మీడియాలో ఈ వీడియో చూసిన నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు.
Updated Date - 2023-07-10T17:13:43+05:30 IST