ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: గ్యాస్ లీక్ అవుతున్నట్లు ఒకటే శబ్ధం వస్తోంటే చూసేందుకు వెళ్లింది.. అయితే చివరికి ఇలాంటి సీన్ చూడాల్సి వస్తుందని ఊహించి ఉండదు..

ABN, First Publish Date - 2023-09-15T21:44:45+05:30

అంతా సవ్యంగా సాగుతుందనుకున్న సమయంలో కొన్నిసార్లు సడన్‌గా షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ‘‘పొద్దున లేచిన వేళావిశేషం బాగాలేదు’’... అంటూ ఇలాంటి సందర్భాల్లోనే అనుకుంటా ఉంటాం. ప్రస్తుతం సోషల్ మీడియా అందుబాటులో ఉండడంతో ఇలాంటి...

ప్రతీకాత్మక చిత్రం

అంతా సవ్యంగా ఉందనుకున్న సమయంలో కొన్నిసార్లు సడన్‌గా షాకింగ్ ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ‘‘పొద్దున లేచిన వేళావిశేషం బాగాలేదు’’... అంటూ ఇలాంటి సందర్భాల్లోనే అనుకుంటా ఉంటాం. ప్రస్తుతం సోషల్ మీడియా అందుబాటులో ఉండడంతో ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా, ఈ తరహా ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గ్యాస్ లీక్ అవుతున్నట్లు శబ్ధం వస్తోంటే ఓ మహిళ చూసేందుకు వెళ్లింది. చివరకి సిలిండర్ వద్ద దృశ్యం చూసి షాక్ అయింది.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ మహిళ ఇంట్లో ఉండగా.. సిలిండర్ వద్ద (Gas cylinder) నుంచి గ్యాస్ లీక్ అవుతున్నట్లు ఒకటే శబ్ధం వస్తోంది. మొదట అనుమానం రాకున్నా.. పదే పదే అదే శబ్ధం వస్తుండడంతో ఏంటా అని అనుమానం కలిగింది. గ్యాస్ పైప్ ఊడిపోయి అలా సౌండ్ వస్తుందేమో అని అనుకుని చూడటానికి వెళ్లింది. అయితే తీరా అక్కడికి వెళ్ల చూడగా.. సిలిండర్ వద్ద పెద్ద కింగ్ కోబ్రా పాము (King cobra) బుసలు కొడుతూ కనిపించింది. దాన్ని చూడగానే ‘‘వామ్మో! పాము’’.. అంటూ కేకలు పెడుతూ బయటకు పరుగులు తీసింది.

Woman: చెట్ల పొదల్లో యువతి మృతదేహం.. ఆమె ఫొటోను ఫేస్‌బుక్‌లో చూసి తల్లిదండ్రులకు ఫోన్.. అసలు ట్విస్ట్ ఏంటంటే..!

సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్ (Snake Catcher) అక్కడికి చేరుకుని పరిశీలించాడు. పామును పట్టుకునేందుకు ప్రయత్నించగా.. కోబ్రా బుసలు కొడుతూ అతన్ని కూడా భయపెట్టింది. చివరకు సిలిండర్ వద్ద నుంచి బయటకు పారిపోయింది. అయినా ఎలాగోలా అతను పామును పట్టుకుని, అటవీ ప్రాంతంలో వదిలిపెట్టాడు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు. ‘‘వామ్మో! ఎంత పెద్ద పాము’’.. అని కొందరు, ‘‘రాత్రి వేళ ఇంట్లోకి వస్తే.. ఏంటి పరిస్థితి’’.. అని మరికొందరు, ‘‘పాముల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి’’.. అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 40వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: ఫ్రాంక్ వీడియోలు చేసే యూట్యూబర్.. ఇలా చేశాడేంటి..? చొక్కావిప్పి.. ఓ ప్లాస్టిక్ కవర్‌ను చుట్టుకుని..!

Updated Date - 2023-09-15T21:44:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising