Viral Video: పెళ్లయిన వెంటనే పోలీస్ స్టేషన్‌కు వచ్చిన వధువు.. చేతిలో ఓ లెటర్.. ఈ యువతి చేసిన రచ్చ వెనుక కథేంటో తెలిసి..
ABN, First Publish Date - 2023-04-05T17:19:45+05:30
కుటుంబ సమస్యలతో కొందరు, ప్రేమలో విఫలమై మరికొందరు మానసికంగా తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. ఈ క్రమంలో చాలా మంది అనూహ్య నిర్ణయాలు తీసుకుంటూ అందరినీ షాక్‌కు గురి చేస్తుంటారు. ఈ క్రమంలో కొందరు యువతీయువకులు..
కుటుంబ సమస్యలతో కొందరు, ప్రేమలో విఫలమై మరికొందరు మానసికంగా తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. ఈ క్రమంలో చాలా మంది అనూహ్య నిర్ణయాలు తీసుకుంటూ అందరినీ షాక్‌కు గురి చేస్తుంటారు. ఈ క్రమంలో కొందరు యువతీయువకులు మరీ విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. ప్రస్తుతం ఇలాంటి ఓ యువతికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చేతిలో ఓ లెటర్ పట్టుకుని పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన ఓ యువతి రచ్చ రచ్చ చేసింది. యువతి ఇలా చేయడానికి గల కారణం తెలుసుకుని అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‍గా మారింది.
ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) హమీర్‌పూర్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన కాజల్ అనే మహిళకు (woman) 2022 ఫిబ్రవరి 18న బాసేలా గ్రామానికి చెందిన అనిల్ శర్మతో వివాహమైంది. అయితే అంతకు ముందే సదరు యువతి ఓ యువకుడితో ప్రేమలో (love) ఉంది. ఎలాగైనా ప్రేమించిన వ్యక్తినే వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో ఇటీవల ఓ రోజు ఆమె వధువులా ముస్తాబై.. చేతిలో ఓ లెటర్ పట్టుకుని పోలీసు కమిషనర్ (Commissioner of Police) కార్యాలయానికి చేరుకుంది. లోపలికి వచ్చీ రాగానే పిచ్చి పట్టినట్లుగా ప్రవర్తిస్తుంది. ‘‘దో షాదీ కరేంగే, దో షాదీ’’.. అంటూ గట్టిగా అరుస్తూ హల్‌చల్ చేస్తుంది. మహిళ ఒక్కసారిగా ఇలా బిహేవ్ చేయడంతో అక్కడున్న వారంతా అవాక్కవుతారు.
ఇంతలో అక్కడే ఉన్న ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు (Women Constables) ఆమెను వారించే ప్రయత్నం చేస్తారు. అయినా ఏమాత్రం వెనక్కు తగ్గని మహిళ.. అలాగే అరుస్తూ ఉంటుంది. ఈ క్రమంలో మహిళా పోలీసులను ఆమెను అదుపు చేయలేక కిందపడిపోతారు. మధ్యలో తన ఫోన్‌ను కూడా నేల కేసి గట్టిగా కొడుతుంది. అయితే చివరకు ఎలాగోలా ఆమెను అక్కడి నుంచి లోపలికి తీసుకెళ్తారు. ఈ ఘటనను అక్కడే ఉన్న వారు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ప్రేమికుడిని పెళ్లి చేసుకుంటే మరి భర్త పరిస్థితి ఏంటమ్మా.. అని కొందరు, కొంపతీసి ఈమె మందుగానీ కొట్టలేదు కదా.. అని ఇంకొందరు, ఈమెకు మానసిక వైద్యం అందించాలి.. అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షల్లో వ్యూస్‌ని సొంతం చేసుకుంది.
Updated Date - 2023-04-05T17:19:45+05:30 IST