ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Viral Video: టికెట్ లేకుండా వందే భారత్ రైలు ఎక్కిన కానిస్టేబుల్.. టీసీ రావడంతో చివరకు ఏం జరిగిందంటే..

ABN, First Publish Date - 2023-10-11T18:44:38+05:30

రైళ్లలో రోజూ అధిక సంఖ్యలో ప్రయాణికులు టికెట్ లేకుండా ప్రయాణిస్తుంటారు. కొన్నిసార్లు టీసీలకు దొరికిన సమయంలో జరిమానా కట్టడమో, లేదా పక్క స్టేషన్‌లో దిగిపోవడమే చేస్తుంటారు. అయితే అత్యాధునిక సౌకర్యాలతో అందుబాటులోకి వచ్చిన వందే భారత్ రైల్లో కూడా ఇలాగే ప్రయాణం చేస్తామంటే కుదరదు. ఒకవేళ...

రైళ్లలో రోజూ అధిక సంఖ్యలో ప్రయాణికులు టికెట్ లేకుండా ప్రయాణిస్తుంటారు. కొన్నిసార్లు టీసీలకు దొరికిన సమయంలో జరిమానా కట్టడమో, లేదా పక్క స్టేషన్‌లో దిగిపోవడమే చేస్తుంటారు. అయితే అత్యాధునిక సౌకర్యాలతో అందుబాటులోకి వచ్చిన వందే భారత్ రైల్లో కూడా ఇలాగే ప్రయాణం చేస్తామంటే కుదరదు. ఒకవేళ అలా దొరికితే భారీ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. వందే భారత్ రైల్లో ఓ కానిస్టేబుల్ టికెట్ లేకుండా ప్రయాణించాడు. అయితే చివరకు టీసీ చెక్ చేయడంతో ఏం జరిగిందంటే..

సోషల్ మీడియాలో వందేభారత్ రైలుకు సంబంధించిన వీడియో (Vande Bharat Train Videos) ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్ పోలీస్ (Uttar Pradesh Police) డిపార్ట్‌మెంట్‌కి సంబంధించిన కానిస్టేబుల్.. ఇటీవల టికెట్ తీసుకోకుండానే (constable boarded train without ticket) వందే భారత్ రైలు ఎక్కాడు. తాను పోలీసు కాబట్టి ఎవరూ తనని టికెట్ అడగరనే ధీమాతో దర్జాగా కూర్చున్నాడు. అయితే మార్గ మధ్యలో టీసీ (Railway TC) అందరినీ చెక్ చేస్తూ కానిస్టేబుల్ వద్దకు వచ్చాడు. అందరిలాగే అతన్ని కూడా టికెట్ అడిగాడు. దీంతో చివరకు తెల్లమొఖం వేసిన కానిస్టేబుల్.. తాను వెళ్లాల్సిన రైలును మిస్ అయ్యానని, దీంతో వందే భారత్ రైలు ఎక్కాల్సి వచ్చిందని సమాధానం ఇచ్చాడు.

Viral Video: ప్రభుత్వ ఆస్పత్రుల్లో పరిస్థితిని కళ్లకు కడుతున్న వీడియో.. వార్డులోకి చొరబడిన ఈ కుక్క చివరికి ఏం చేసిందో చూస్తే..

అయినా టికెట్ లేకుండా రైలు ఎక్కడం ఏంటంటూ టీసీ ప్రశ్నిస్తాడు. టికెట్ లేకుండా ప్రయాణించడం కుదరదని చెప్పారు. అయితే ఆ సమయంలో చేసేదేమీలేక.. వచ్చే స్టేషన్‌లో దిగి వెళ్లిపోవాలని సూచించారు. కాగా, ఈ ఘటనను అక్కడే ఉన్న ప్రయాణికులు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో చివరకు ఈ విషయం రైల్వే అధికారుల వరకూ వెళ్లింది. దీంతో ఉన్నతాధికారులు ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘టీసీ మంచిగా బదులిచ్చారు’’.. అని కొందరు, ‘‘పోలీసుల బుద్ధి బయటపెట్టాడు’’.. అని మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: ఎంత దారుణం! దోపిడీ దొంగలను అడ్డుకున్న పాపానికి ఈ క్యాబ్ డ్రైవర్ పరిస్థితి.. చివరకు..

Updated Date - 2023-10-11T18:44:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising