ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: పాములను పక్కలో పడుకోబెట్టుకున్న మహిళ.. అంతటితో ఆగకుండా మరీ విచిత్రంగా ఇదేంటీ..

ABN, First Publish Date - 2023-02-19T19:47:45+05:30

పాముల పక్కన నిలబడాలంటేనే చచ్చేంత భయం కలుగుతుంది. పొరపాటున అవి అత్యంత సమీపానికి వస్తే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే కొందరు పాములతో చెలగాటం ఆడుతూ ఉంటారు. అందరి ముందూ హీరోలా ఫీలవుతూ పాములతో పరాచకాలు ఆడి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాముల పక్కన నిలబడాలంటేనే చచ్చేంత భయం కలుగుతుంది. పొరపాటున అవి అత్యంత సమీపానికి వస్తే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే కొందరు పాములతో చెలగాటం ఆడుతూ ఉంటారు. అందరి ముందూ హీరోలా ఫీలవుతూ పాములతో పరాచకాలు ఆడి చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకున్న ఘటనలు కూడా ఇటీవల చాలా జరిగాయి. అలాగే పడుకుందామని బెడ్ వద్దకు వెళ్తే.. పరుపు కింద నుంచి వచ్చే పాములను కూడా చూశాం. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియోలో పాములను (Snake viral videos) పక్కలో పడుకోబెట్టుకున్న మహిళను చూసి అంతాషాక్ అవుతున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ (women Viral videos) అవుతోంది. ఓ మహిళ బెడ్‌పై పడుకుని ఉంటుంది. ఇందులో విశేషం ఏమీ లేకున్నా.. పక్కలో పాములను పెట్టుకుని పడుకోవడమే ఇక్కడ వెరైటీ. రెండు పెద్ద పాములను తన మీద పడుకోబెట్టుకుని.. వాటిపై చేయి పెట్టి ప్రేమగా నిమురుతుంది. కిందకు వెళ్లిపోవాలని ప్రయత్నిస్తున్న పాములను.. పదే పదే పట్టుకుని మరీ మీదకు తెచ్చుకుంటుంది. అంతటితో ఆగకుండా పిల్లల తరహాలో పడుకోండి, పడుకోండి.. అంటూ జోకొడుతూ ఉంటుంది. రెండు పాములూ ఒంటిపై అటూ ఇటూ పాకుతున్నా ఆమె మొఖంలో ఇసుమంత కూడా కంపరం కానీ, భయం కానీ కనిపించదు. ఈ వీడియో చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. వామ్మో! ఈమేంట్రా బాబూ.. మరీ ఇంత వెరైటీగా ఉంది.. అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షల్లో వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

స్నేహితుల కక్కుర్తితో ఆగిన పెళ్లి ఊరేగింపు.. వరుడు ఎంతకీ రాలేదని అంతా కంగారుపడుతుంటే.. చివరకు అతడు చేసిన నిర్వాకం..

Updated Date - 2023-02-19T19:48:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising