ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Viral Video: నోట్ల కట్టలు చూడగానే ప్రియుడిని వదిలేసి మరో కుర్రాడితో ఎస్కేప్.. సరదాకి తీసిందే అని తెలుస్తోంది కానీ..!

ABN, First Publish Date - 2023-05-24T19:40:04+05:30

ప్రస్తుతం చాలా మంది యువత.. తమలోని పాండిత్యాన్ని, ప్రావీణ్యాన్ని బయటపెట్టేందుకు సోషల్ మీడియాను వేదికగా చేసుకుంటున్నారు. కొందరు.. ప్రజలకు సందేశం ఇచ్చే విధంగా వీడియోలు చేస్తుంటే.. మరికొందరు వివిధ రకాల విన్యాసాలు చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటున్నారు. ఇంకొందరైతే ఎలాగైనా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రస్తుతం చాలా మంది యువత.. తమలోని పాండిత్యాన్ని, ప్రావీణ్యాన్ని బయటపెట్టేందుకు సోషల్ మీడియాను వేదికగా చేసుకుంటున్నారు. కొందరు.. ప్రజలకు సందేశం ఇచ్చే విధంగా వీడియోలు చేస్తుంటే.. మరికొందరు వివిధ రకాల విన్యాసాలు చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటున్నారు. ఇంకొందరైతే ఎలాగైనా ఫేమస్ అవ్వాలనే ఉద్దేశంతో వివిధ రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఇక ప్రేమికుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. లవ్ ప్రపోజల్ దగ్గర నుంచి తమ జీవితంలో జరిగే అన్ని ఘట్టాలను.. వీడియోలుగా మార్చి నెట్టింట్లోకి వదులుతుంటారు. ఇటీవల ఇలాంటి వీడియోలు తెగ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఓ ప్రేమ జంటకు సంబంధించిన వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. ఓ యువతి నోట్ల కట్టలు చూడగానే తన ప్రియుడిని వదిలేసి మరో యువకుడితో ఎస్కేప్ అయింది. ఈ వీడియోను సరదా కోసం చిత్రీకరించినా.. నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ హల్‌చల్ చేస్తోంది. ఓ యువకుడు తన ప్రేయసిని (girlfriend) పక్కన పెట్టుకుని ఫోన్‌లో కెమెరాను ఆన్ చేస్తాడు. ప్రేయసిపై తన ప్రేమను వ్యక్తం (Expressing love) చేస్తూ ఆమెను పొగడ్తలతో ముంచెత్తుతుంటాడు. సదరు యువతి కూడా తన ప్రియుడి పట్ల ప్రేమగా వ్యవహరిస్తూ నవ్వుతూ ఉంటుంది. అయితే అదే సమయంలో ఊహించని ఘటన చోటు చేసుకుంటుంది. మరో యువకుడు బైకుపై వచ్చి ప్రేమికుల వెనుక వైపు ఆగుతాడు. జేబు నుంచి నోట్ల కట్టలు (Currency notes) చూపిస్తూ యువతికి ఆశ చూపుతాడు. కెమెరాలో డబ్బుల కట్టలను చూసిన యువతి.. వెంటనే వెనక్కి తిరిగి బైకుపై ఉన్న యువకుడిని చూస్తుంది.

Viral News: సాఫ్ట్‌వేర్ కష్టాలు పడీ పడీ ఈ 29 ఏళ్ల కుర్రాడికి విసుగొచ్చిందట.. చివరకు జాబ్‌కు రిజైన్ చేసి ఏం చేస్తున్నాడంటే..!

నోట్ల కట్టలను చూసిన యువతి (young woman) .. క్షణం ఆలస్యం చేయకుండా అతడి వద్దకు వెళ్లి, డబ్బులు తీసుకుని ‘‘పదా.. వెళ్దాం’’.. అంటూ అతడి బైకుపై కూర్చుంటుంది. ఈ ఘటనతో అంత వరకూ నవ్వుతూ వీడియో (Video) తీస్తున్న యువకుడు.. ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఆ వెంటనే సింబాలిక్‌గా బాధాకరమైన పాట (Sad song) ప్లే అవుతుంది. ఆ యువకుడు అదే ఎక్స్‌ప్రెషన్ ఇస్తూ అలాగే చూస్తే ఉండిపోతాడు. ఈ వీడియో సరదా కోసం చిత్రీకరించినా.. అందరినీ తెగ ఆకట్టుకుంటోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘నేటి సమాజంలో కొంత మంది యువతులు అచ్చం ఇలాగే ప్రవర్తిస్తున్నారు’’.. అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Viral Video: ఓ యువతికి రోడ్డు పక్కన కనిపించిందో సోఫా.. దాని ఖరీదెంతో చూసి షాక్.. వెంటనే అదిరిపోయే ప్లాన్.. చివరకు..!

Updated Date - 2023-05-24T19:40:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising