Crime News: ఫిర్యాదు చేసిన 20 ఏళ్ల తర్వాత కేసు నమోదు.. దారుణం ఏమిటంటే.. కేసు పెట్టిన వ్యక్తి ఎప్పుడో చనిపోయాడు..!
ABN, First Publish Date - 2023-05-03T16:30:40+05:30
కొన్ని కేసులు ఏళ్లకు ఏళ్లు కొనసాగుతూనే ఉంటాయి. ఇక కోర్టుల్లో అయితే లక్షల కేసులు పెండింగ్‌లో పడుతుంటాయి. దేశంలో పెండింగ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోందని గతంలో సాక్షాత్తు కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే..
కొన్ని కేసులు ఏళ్లకు ఏళ్లు కొనసాగుతూనే ఉంటాయి. ఇక కోర్టుల్లో అయితే లక్షల కేసులు పెండింగ్‌లో పడుతుంటాయి. దేశంలో పెండింగ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోందని గతంలో సాక్షాత్తు కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. ఓ భూకబ్జా కేసుపై ఫిర్యాదు చేసిన 20ఏళ్ల తర్వాత కేసు నమోదు చేశారు. అయితే ఇందులో దారుణం ఏంటంటే.. కేసు పెట్టిన వ్యక్తి ఎప్పుడో చనిపోయాడు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వార్తకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) బరేలీ పరిధి రాంపూర్ సమీప ప్రాంతానికి చెందిన మహ్మద్ అలీ అనే వ్యక్తి భూమిని కొందరు కబ్జా (land grabbing) చేశారు. దీనిపై మహ్మద్ 2004 నవంబర్‌లో అప్పటి డీఎంకు ఫిర్యాదు చేశాడు. షాహిద్ అలీఖాన్, తహసీల్ అనే వ్యక్తులు కొందరు ప్రభుత్వ సిబ్బందితో కలిసి తన భూమిని కబ్జా చేసి, తమ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆరోపించాడు. 2006లో ప్రభుత్వానికి చేరడంతో.. ఈ కేసును బరేలీ సెక్టార్ ఆఫ్ విజిలెన్స్‌కు బదిలీ చేసింది. విచారణలో రిజిస్ట్రార్ కార్యాలయంలో (Registrar Office) పని చేసే అకౌంటెంట్ నరేష్ బాబు, రిజిస్ట్రార్ సుశీల్ కుమార్, పర్వారీ తదితర సిబ్బంది పేర్లు కూడా తెరపైకి వచ్చాయి.
ఈ కేసు విచారణ ఏళ్లుకు ఏళ్లు కొనసాగుతూ వచ్చింది. ఆశ్చర్యకరంగా విజిలెన్స్ అధికారులు (Vigilance officers) గత సోమవారం.. ఈ కేసుపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అయితే ఈ క్రమంలో ఫిర్యాదుదారు మహ్మద్‌తో పాటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న సుశీల్ కుమార్, నరేష్ బాబు మృతి చెందారు. విజిలెన్స్ ఇన్‌స్పెక్టర్ (Vigilance Inspector) భూపేష్ కుమార్ దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో షాహిద్ అలీ, సయ్యద్ లియాఖత్‌పై ఫోర్జనీ సహా వివిధ సెక్షన్ల కేసులు నమోదు చేశారు. కాగా, ఈ వార్త ప్రస్తుతం (Viral news) సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Updated Date - 2023-05-03T16:30:40+05:30 IST